Star Health IPO: ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌ఝున్‌వాలా-ప్రమోట్ చేసిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్ 10న దాదాపు 6 శాతం తగ్గింపుతో స్టాక్ మార్కెట్లో లిస్టై నిరుత్సహపరిచింది. కంపెనీ షేర్లు ఒక్కొక్కటి రూ. 900 చొప్పున విక్రయించగా… ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO), BSEలో రూ. 848.80 వద్ద ప్రారంభమైంది. 900 కంటే ఇది 5.69 శాతం తక్కువ. అయితే ట్రెడింగ్ లో 50 పాయింట్లకు పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.901 వద్ద కొనసాగుతోంది. ఈ ఇష్యూ రూ. 2,000 కోట్ల సేకరణే లక్ష్యంగా ఐపీవోగా వచ్చింది. దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 870-900గా ఉంది. తొలి రోజు ప్రదర్శన నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, బగ్ బుల్ బీమా సంస్థ పట్ల ఆశాజనకంగా ఉంది. “భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేసే మొత్తంలో 15% లేదా అంతకంటే తక్కువ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో, 80% కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి, భారతదేశంలో చాలా ప్రారంభ పరిశ్రమ ” అని రాకేష్ ఝున్‌జున్‌వాలా అన్నారు.
“భారతదేశంలో రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో దాదాపు 31% మార్కెట్ వాటాతో స్టార్ హెల్త్ సెక్టార్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఎదగడానికి సిద్ధంగా ఉన్న పరిశ్రమలో ఈ రకమైన ఆధిపత్యం చాలా అరుదుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి, నేను ఆశాజనకంగా ఉన్నాను. అందుకే నేను ఇష్యూలో ఎలాంటి షేర్లను విక్రయించలేదు” అని చెప్పారు. బీమా సంస్థ ప్రమోటర్ పెద్ద పాత్ర పోషించాలని జున్‌జున్‌వాలా అభిప్రాయపడ్డారు. ఒక బీమా సంస్థ ప్రమోటర్‌గా, నేను దానికి మూలధన సమృద్ధిని అందించడానికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు.
స్టార్ హెల్త్ దేశంలో ప్రముఖ ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థ, వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, రాకేష్ జున్‌జున్‌వాలా లాంటి పెట్టుబడిదారుల కన్సార్టియం యాజమాన్యంలో ఈ కంపెనీ ఉంది. డిసెంబరు 2న ముగిసిన IPO చివరి రోజున ఇది 79 శాతం సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఇద్దరికీ కేటాయించిన భాగాలు పూర్తిగా సబ్‌స్క్రయిబ్ చేయబడినందున బీమా సంస్థ యొక్క ఆఫర్ అమలులోకి వచ్చింది.