Hyderabad: త్వరలోనే పట్టాలెక్కనున్న డబుల్ డెక్కర్ రైల్.. వందేభారత్ తరహాలోనే..

| Edited By: Jyothi Gadda

Sep 10, 2023 | 1:07 PM

Hyderabad: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం ఎనిమిది డబుల్ డెక్కర్ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఆరు ఏసి ట్రైన్స్ కాగా, మిగతా రెండు నాన్ ఎసి ట్రైన్స్. ఈ ఎనిమిది డబుల్ డెక్కర్ ట్రైన్స్ లలో కేవలం ఒకటి మాత్రమే విశాఖపట్నం తిరుపతి మధ్య పరుగులు పెడుతుంది. ఈ ఒక్కటి మినహాయిస్తే తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేదు. కాబట్టి పూర్తిస్థాయిలో

Hyderabad: త్వరలోనే పట్టాలెక్కనున్న డబుల్ డెక్కర్ రైల్.. వందేభారత్ తరహాలోనే..
Double Decker Trains
Follow us on

వందేభారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈతరణంలోనే ఇండియన్ రైల్వేలో ఫెయిల్యూర్ గా ముద్రపడ్డ డబల్ డెక్కర్ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. వందేభారత్‌ ట్రైన్ తరహాలో సక్సెస్ చేయాలని ఆలోచన చేస్తుంది. ఇప్పటికే అతికొన్ని డబుల్ డెక్కర్ ట్రైన్స్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నప్పటికీ… పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ భావిస్తుంది.

మనం భాగ్యనగరంలో గతంలో డబల్ డెక్కర్ బస్సులు అందుబాటులో ఉండేవి కలెక్టర్ అయిన అవి అంతరించిపోయాయి. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం డబల్ డెక్కర్ బస్సులను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా గతంలో అందుబాటులో ఉన్న డబల్ డెక్కర్ రైళ్లకు ప్రజల నుంచి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో ఫెయిల్యూర్ గా ముద్ర పడిపోయింది. కానీ అందే భారత రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదట్లో కొంత విమర్శలు వచ్చినప్పటికీ తర్వాత పూర్తిస్థాయిలో ప్రజలు వినియోగించుకోవడంతో వందే భరత్ ట్రైన్స్ సక్సెస్ అయ్యాయని ఇండియన్ రైల్వే భావిస్తుంది. ఈ క్రమంలోని డబల్ డెక్కర్ రైళ్లపై రైల్వే శాఖ ఎందుకు ఫెయిల్యూర్ గా ముద్రపడ్డాయి అనే ఆలోచన తో మరోసారి ప్రజలకు పూర్తి స్థాయి లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.

ఆక్యుపెన్సి రేషియో లేక ఒక్కొక్కటిగా మూలపడు తున్న డబల్ డెక్కర్ రైలెను మళ్లీ పట్టాలెక్కించి సక్సెస్ చేయాలని భావిస్తోంది రైల్వే శాఖ. డబల్ డెక్కర్ రైళ్లు కేవలం పగటిపూట మాత్రమే తిరిగేలా రైల్వే శాఖ ప్రవేశపెట్టింది.మిగిలిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్ వేగంతోనే వాటిని కూడా నడిపారు దీంతో 11 గంటల పాటు ఆ ట్రైన్ లోనే టైం వేస్ట్ అవుతుందని ప్రయాణికులు భావించారు. దీంతో అక్యుపెన్స్ రేషియో దాదాపు వారం రోజుల్లోనే 14 శాతానికి చేరింది. దీంతో సికింద్రాబాద్ తిరుపతి,సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టిన డబల్ డెక్కర్ రైళ్లు రద్దు చేసింది రైల్వే శాఖ.

ఇవి కూడా చదవండి

వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరుగులు పెడుతున్నప్పటికీ టైం జర్నీ చాలా తక్కువగా ఉండటంతో ఈ రెండు ట్రైన్ల ఆక్టిఫెన్సీ రేషియో 100 శాతానికి పైగా ఉంటుంది. అంటే వందే భారత్ తరహాలో అన్ని రూట్లో డబల్ డెక్కర్ రైళ్లు వేగం పెంచడం సాధ్యం కాదు కనుక డబల్ డెక్కర్ ట్రైన్లలో వ్యక్తులు ప్రవేశపెట్టి రాత్రివేళ తిప్పి ఆలోచనలో రైల్వే శాఖ ఉంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం ఎనిమిది డబుల్ డెక్కర్ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఆరు ఏసి ట్రైన్స్ కాగా, మిగతా రెండు నాన్ ఎసి ట్రైన్స్. ఈ ఎనిమిది డబుల్ డెక్కర్ ట్రైన్స్ లలో కేవలం ఒకటి మాత్రమే విశాఖపట్నం తిరుపతి మధ్య పరుగులు పెడుతుంది. ఈ ఒక్కటి మినహాయిస్తే తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేదు. కాబట్టి పూర్తిస్థాయిలో భక్తులు, ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టి రాత్రిపూట తిప్పేలా ఆలోచన చేస్తున్న రైల్వే శాఖ దానితోపాటు డబల్ డెక్కర్ లో పైడెక్కులు ప్రయాణికులు కింది డెక్ లో సరుకులను ఒకేసారి తరలించే విధంగా ప్యాసింజర్ గూడ్స్ నమూనాలో కూడా డబల్ డెక్కర్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తుంది దీనికి సంబంధించి డిజైన్ కూడా రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు దీంతో ఖర్చుతోపాటు సమయం ఆదావుతుందని రైల్వే శాఖ భావిస్తుంది. ఈ ఆలోచనతో డబల్ డెక్కర్ రైలు మళ్లీ పట్టాలెక్కించవచ్చు అని ఆలోచన చేస్తుంది ఇండియన్ రైల్వే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..