Oneplus Hyderabad: ఇకపై హైదరాబాద్‌ నుంచే దేశ మంతటికీ వన్‌ప్లస్‌ టీవీలు.. ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్‌..

Oneplus Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా తమ సేవలను అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి...

Oneplus Hyderabad: ఇకపై హైదరాబాద్‌ నుంచే దేశ మంతటికీ వన్‌ప్లస్‌ టీవీలు.. ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్‌..
One Plus Hyderabad

Edited By: Ravi Kiran

Updated on: Jul 24, 2021 | 9:08 AM

Oneplus Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా తమ సేవలను అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ వచ్చి చేరింది. ఇక భారత దేశ వ్యాప్తంగా అవసరమయ్యే స్మార్ట్‌ టీవీలన్నీ హైదరాబాద్‌ కేంద్రంగా తయారుకానున్నాయి. నగరానికి చెందిన రేడియంట్‌ అనే ఎలక్ట్రానిక్స్‌ సంస్థ పలు కంపెనీలకు చెందిన టీవీలను రూపొందిస్తుంటుంది. ఈ సంస్థే ఇప్పటి వరకు వన్‌ప్లస్‌ టీవీలను రూపొందిస్తోంది. అయితే ఇప్పటి వరకు వన్‌ప్లస్‌ టీవీల తయారీకి అవసరమయ్యే మడి సరుకులను దిగుమతి చేసుకునే వారు. కానీ తాజాగా వన్‌ప్లస్‌ తీసుకున్న నిర్ణయంతో ఇకపై భారత్‌లో వన్‌ప్లస్‌ టీవీల తయారీకి భాగ్య నగరం హబ్‌గా మారనుంది.

ఈ విషయమై రేడియంట్‌ ఎండీ రమిందర్‌ సింగ్‌ సొని మాట్లాడుతూ.. ‘వన్‌ప్లస్‌ సంస్థతో కలిసి మేము 2020 నుంచి పనిచేస్తున్నాము. గడిచిన మూడు నెలల్లో మేము 5 లక్షల టీవీలను తయారు చేశాం. ఈ సంఖ్యను డిసెంబర్‌ నాటికి 10 లక్షలకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని’ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని మహేశ్వరం ఫ్యాబ్‌ సిటీలో ఉన్న ఈ కంపెనీ ఇప్పటికే సామ్‌సంగ్‌, షియోమీ వంటి బ్రాండ్‌లకు చెందిన టీవీలను తయారు చేస్తోంది.

హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్‌..

వన్‌ప్లస్‌ టీవీల తయారీకి హైదరాబాద్‌ హబ్‌గా మారడం పట్ల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హర్హం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రజలతో పంచుకున్న మంత్రి.. వన్‌ప్లస్‌ తీసుకున్న నిర్ణయం సంతోషదాయం అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులను కొనసాగిస్తున్నందుకు వన్‌ప్లస్‌ సంస్థ సీఈఓ పెటెలావ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Also Read:  SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక.. ఆన్‌లైన్‌ సేవలకు కాసేపు అంతరాయం. ఎప్పడి నుంచి ఎప్పటి వరకంటే..

Traffic Advisory: ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి.. శంషాబాద్ వెళ్లే సర్వీస్ రోడ్డు మూసివేత.. వివరాలివే

Arikelu: డెంగ్యూ, టైఫాయిడ్, వైరస్ వ్యాధుల బారిన పడ్డారా.. వెంటనే కోలుకోవడానికి ఈ సిరిధాన్యాన్ని ఆహారంగా తీసుకోండి..