PM Kisan: భార్యభర్తలిద్దరికి పీఎం కిసాన్ ప్రయోజనాలుంటాయా ? అర్హులెవరో తెలుసుకోండిలా..

| Edited By: Rajitha Chanti

Jul 19, 2021 | 11:11 AM

కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో రైతుల కోసం కూడా కొన్ని పథకాలను ప్రవేశ పెట్టింది.

PM Kisan: భార్యభర్తలిద్దరికి పీఎం కిసాన్ ప్రయోజనాలుంటాయా ? అర్హులెవరో తెలుసుకోండిలా..
Pm Kisan
Follow us on

కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో రైతుల కోసం కూడా కొన్ని పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం. ఈ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా.. విడుతల వారిగా రూ.2000 చొప్పున రైతుల అకౌంట్‏లో జమ అవుతాయి.

ఇప్పటి వరకు 8 విడతలుగా రైతుల అకౌంట్‏లోకి నగదు జమ చేసింది ప్రభుత్వం. ఆగస్టు నెలలో 9వ విడత డబ్బులను ఇవ్వనున్నట్లుగా గత కొద్ది రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ డబ్బులు కేవలం పీఎం కిసాన్ పథకంలో రిజిస్టర్ చేసుకున్న రైతులకు మాత్రమే వస్తాయి. అయితే ఈ స్కీమ్ ప్రారంభమైన ఇన్ని రోజులకు ప్రజలలో అనేక సందేహాలున్నాయి. ఒక కుటుంబంలోని భార్యభర్తలిద్దరూ ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం.. కుటుంబంలోని ఒక వ్యక్తి మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇంట్లోని భార్యభర్తలిద్దరికి ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందలేరు. ఒకవేళ ఎవరైనా నియమాలను ఉల్లంఘించి ఇద్దరి పేర్లు నమోదు చేసుకున్నట్లైతే.. వారు ఈ పథకం నుంచి మినహాయించబడతారు. అనంతరం వారు రైతులుగా అనర్హులు అవుతారు.

అర్హుల వివరాలు..

1. వ్యవసాయం కాకుండా.. వేరే పని కోసం తమ వ్యవసాయ భూములను ఉపయోగిస్తున్న వారికి ఈ పథకం వర్తించదు.
2. అలాగే తమ సొంత భూమి కాకుండా.. ఇతర వ్యక్తుల భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు కూడా.. ఆ భూమి యాజమానులు కూడా ఈ పథకానికి అనర్హులు.
3. వ్యవసాయ భూములు అతను, ఆమె పేరుతో రిజిస్టర్ కాకపోతే సదరు వ్యక్తి ఈ పథకానికి అనర్హుడు.
4. అంతేకాకుండా.. వ్యక్తి తండ్రి లేదా తాతా పేరుతో భూమి రిజిస్టర్ అయి ఉంటే.. ఈ పథకం వర్తించదు.
5. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వ్యవసాయ భూముల యజమానులకు ఈ పథకం చెల్లదని ప్రకటించబడుతుంది.
6. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈ పథకానికి అనర్హులు.

Also Read: Rajendra Prasad: ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే హీరో.. నటకీరిటి రాజేంద్ర ప్రసాద్ బర్త్ స్పెషల్..

Mahesh Babu: క్రేజీ ప్రాజెక్టుకు అంతా సిద్ధం.. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మహేష్‌ బాబు సినిమా.. దర్శకుడు ఎవరంటే.?