Business Idea: అలోవేరా జ్యూస్ తయారీతో అదిరిపోయే లాభాలు.. నెలనెలా లక్షల్లో ఆదాయం

|

Mar 16, 2024 | 5:45 PM

ముఖ్యంగా సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాదంతా మంచి ఆదాయం ఇచ్చే వ్యాపారాల వైపు యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ సామర్థ్యంతో వ్యాపారాన్ని నిర్వహించాలనుకునే వారు నెలనెలా లక్షల్లో ఆదాయాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలోవెరా జ్యూస్ తయారీ యూనిట్ ద్వారా లక్షల్లో ఆదాయం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలోవేరా అంటే కలబంద, మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఈ మొక్క ఉంటుంది.

Business Idea: అలోవేరా జ్యూస్ తయారీతో అదిరిపోయే లాభాలు.. నెలనెలా లక్షల్లో ఆదాయం
Alovera
Follow us on

ప్రస్తుత రోజుల్లో యువత ఉద్యోగం కంటే వ్యాపారమే మేలని భావిస్తుంది. అయితే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు మంచి వ్యాపారాల కోసం అన్వేషిస్తూ ఉన్నారు. బంపర్ ఆదాయం వచ్చే అవకాశం ఉన్న వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాదంతా మంచి ఆదాయం ఇచ్చే వ్యాపారాల వైపు యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ సామర్థ్యంతో వ్యాపారాన్ని నిర్వహించాలనుకునే వారు నెలనెలా లక్షల్లో ఆదాయాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలోవెరా జ్యూస్ తయారీ యూనిట్ ద్వారా లక్షల్లో ఆదాయం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలోవేరా అంటే కలబంద, మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఈ మొక్క ఉంటుంది. అయితే ఈ మొక్క ద్వారా శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, మినరల్స్ అందించవచ్చని చాలా మందికి తెలియదు.అలాగే ఈ మొక్కకు యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు ఉన్నాయి. కలబందకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా అలోవెరా జ్యూస్ తయారీ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది.  కాబట్టి అలోవేరా జ్యూస్ వ్యాపారాన్ని పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి? వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

అలోవేరా జ్యూస్ వ్యాపారానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) అలోవెరా జ్యూస్ బిజినెస్ ప్రాజెక్ట్ కాస్ట్ రూ.26.56 లక్షలుగా ఉంది. అయితే పెట్టుబడిదారుడు కేవలం రూ.2.66 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ఫైనాన్స్ చేయవచ్చు. మీకు రూ. 18.90 లక్షల టర్మ్ లోన్ లభిస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ. 5 లక్షలు ఫైనాన్స్ చేస్తారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఉద్యోగ్ ఆధార్ నమోదు, ఉత్పత్తి బ్రాండ్ పేరు అవసరం అవుతుంది. 

అలోవేరా జ్యూస్ తయారీ వ్యాపారం నుంచి సంవత్సరానికి రూ. 13 లక్షల కంటే ఎక్కువ సంపాదించవచ్చు. మొదటి సంవత్సరంలో దాదాపు రూ.3.03 లక్షల లాభం ఉంటుంది. రెండో ఏడాది రూ.4.15 లక్షలు, మూడో ఏడాది రూ.7.76 లక్షలు లాభం ఉంటుంది. దీని తరువాత, ఈ లాభం వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఐదో సంవత్సరంలో దాదాపు రూ.13.88 లక్షల లాభం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.