Telugu News Business Huge interest rates in those banks on FDs, How much interest does any bank give on a year's deposit, FD Interest Rates details in telugu
FD Interest Rates: ఎఫ్‌డీలపై ఆ బ్యాంకుల్లో భారీ వడ్డీ రేట్లు.. ఏడాది డిపాజిట్‌పై ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందంటే..?
భారతదేశంలోని ప్రజలకు పెట్టుబడి అంటే టక్కున గుర్తు వచ్చేది ఎఫ్‌డీ. ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా నిర్ణీత వ్యవధిలో నిర్దిష్ట మొత్తంలో డబ్బు డిపాజిట్ చేస్తే బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడిదారులు కచ్చితంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ వ్యవధిని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
భారతదేశంలోని ప్రజలకు పెట్టుబడి అంటే టక్కున గుర్తు వచ్చేది ఎఫ్‌డీ. ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా నిర్ణీత వ్యవధిలో నిర్దిష్ట మొత్తంలో డబ్బు డిపాజిట్ చేస్తే బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడిదారులు కచ్చితంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ వ్యవధిని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఎఫ్‌డీల్లో ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధి వరకు పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎఫ్‌డీల్లో ధీర్ఘకాల వ్యవధితో పెట్టుబడి పెడితే తక్కువ వడ్డీ రేటు వస్తుందని, ఏడాది నుంచి ఐదేళ్లలోపు పెట్టుబడులపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను పొందవచ్చని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది డిపాజిట్‌పై ఏయే బ్యాంకులు ప్రస్తుతం ఎంత శాతం వడ్డీ అందిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇలా
బ్యాంక్ ఆఫ్ బరోడా – 6.85 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.8 శాతం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 6.75 శాతం
కెనరా బ్యాంక్- 6.85 శాతం
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.85 శాతం
ఇండియన్ బ్యాంక్- 6.1 శాతం
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 6.9 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్- 6.8 శాతం
పంజాబ్ & సింధ్ బ్యాంక్- 6.3 శాతం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.8 శాతం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.8 శాతం
ప్రైవేట్ బ్యాంకుల్లో ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇలా
యాక్సిస్ బ్యాంక్- 6.7 శాతం
బంధన్ బ్యాంక్- 7.25 శాతం
సిటీ యూనియన్ బ్యాంక్- 7 శాతం
సీఎస్‌బీ బ్యాంక్- 5 శాతం
డీబీఎస్ బ్యాంక్- 7 శాతం
డీసీబీ బ్యాంక్- 7.1 శాతం
ఫెడరల్ బ్యాంక్- 6.8 శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- 6.6 శాతం
ఐసీఐసీఐ బ్యాంక్- 6.7 శాతం
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ – 6.5 శాతం
ఇండస్ ఇండ్ బ్యాంక్- 7.75 శాతం
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇలా