
ప్రముఖ ఈవీ కంపెనీ అయిన ఒకయా తన రెండేళ్ల వార్షికోత్సవం సందర్భంగా తన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ తగ్గింపులు జూలై 31 వరకు కంపెనీ అందిస్తున్న మాన్‌సూన్ క్యాష్‌బ్యాక్ స్కీమ్‌తో కలిపి ఉంటాయి. భారత ప్రభుత్వం ఎఫ్ఏఎంఈ – II సబ్సిడీల్లో తగ్గింపును ప్రకటించిన తర్వాత ఈవీ స్కూటర్ల ధరల పెంపునకు దారితీసింది. సబ్సిడీల తగ్గింపు తర్వాత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ కొంతమేర మందగమనంలో ఉన్న సమయంలో సేల్స్‌ను నిలబెట్టుకునేందుకు ఒకాయా ఈ ఆఫర్లను ప్రకటించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒకయా ఏయే స్కూటర్లపై ఆఫర్లను అందిస్తుందో? ఓ సారి చూద్దాం.
ఎంట్రీ లెవల్ ఒకాయా క్లాస్ ఐక్యూ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువగా ఈ సేల్లో అందుబాటులో ఉంది. ఒకాయా ఫాస్ట్ ఎఫ్2టీ, ఎఫ్2బీ ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా రూ. 1 లక్షలోపే అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు ఒకాయా ఫాస్ట్ ఎఫ్1టీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,950కి కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ స్కూటర్‌పై రూ. 10,800 తగ్గింపు లభిస్తుంది. ఒకాయ ఫాస్ట్ ఎఫ్2బీ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 8,500 తగ్గింపుతో రూ. 99,400కి అందుబాటులో ఉంది. ఒకాయా జూలై 31 వరకు మాన్‌సూన్ క్యాష్‌బ్యాక్ పథకాన్ని కూడా నిర్వహిస్తోంది. కాబట్టి ఒకాయా ఫాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 5,000 వరకు విలువైన క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే రూ. 50,000 విలువైన థాయిలాండ్ ట్రిప్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. ఫాస్ట్ ఎఫ్4, ఫాస్ట్ ఎఫ్3, ఎఫ్2బీ, ఎఫ్2టీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రతి కొనుగోలుపై రూ. 500 నుంచి రూ.5000 వరకూ క్యాష్‌బ్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి