Ayushman card: ఆయుష్మాన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు.. రెండు నెలల్లో ఎన్ని లక్షలంటే..?

|

Dec 10, 2024 | 5:03 PM

ఉద్యోగం, వ్యాపారాల నుంచి రిటైర్ ఇంటి వద్ధ విశ్రాంతి తీసుకునే సీనియర్ సిటిజన్లందరూ ఎదుర్కొనే పెద్ద సమస్య అనారోగ్యం. వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఎప్పుడూ దాడి చేస్తుంటాయి. వారికి వచ్చే పింఛన్లు, ఇతర ఆదాయంలో ఎక్కువ భాగం ఆస్పత్రిలో వైద్య ఖర్చులకు సరిపోతాయి. ఇక పేదవారి సంగతి అయితే చెప్పనవసరం లేదు. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు సరిపోక తీవ్ర అవస్థలు పడతారు.

Ayushman card: ఆయుష్మాన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు.. రెండు నెలల్లో ఎన్ని లక్షలంటే..?
Ayushman Vay Vandana Cards
Follow us on

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం జేఏవై)లో రూ.5 లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. దీనికోసం 70 ఏళ్ల దాటిన వారందరూ ఆయుష్మాన్ వే వందన కార్డును తీసుకోవాలి. ఈ కార్డును ప్రారంభించిన రెండు నెలలలోపే 25 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 అక్టోబర్ 29వ తేదీన ఆయుష్మాన్ వే వందన కార్డును ప్రారంభించారు. అనంతరం రెండు నెలల్లోనే దాదాపు 25 లక్షల మంది ఈ కార్డు తీసుకున్నారు. దీని ద్వారా 70 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లందరికీ వారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకూ ఉచితం వైద్యం అందిస్తారు. గతంలోనే ఈ పథకం అమల్లో ఉంది. దాని ద్వారా కుటుంబానికి రూ.5 లక్షల విలువైన వైద్యం అందించేవారు. కుటుంబంలోని సభ్యులందరికీ ఇది వర్తించేది. ఇప్పడు ఆ కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా రూ.5 లక్షల వైద్య సాయం అందించేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా దీన్ని అమలు చేస్తున్నారు.

ప్రపంచంలోని అతి పెద్ద ఆరోగ్య పథకంగా పీఎంజేఏవైని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 సెప్టెంబర్ 23న జార్ఘండ్ లో దీన్ని ప్రారంభించారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకూ ఆరోగ్య బీమా కవరేజీ అందుతుంది. పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం దీన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా నగదు రహిత చికిత్సలు అందుతాయి. మందులు, చికిత్స రుసుము, డాక్టర్ ఫీజు, ఓటీ-ఐసీయూ ఫీజులు దీనిలోనే ఉంటాయి. సాధారణంగా కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దవారు ఉంటారు. వీరిలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరందరికీ కలిపి అందించే రూ.5 లక్షల ఆరోగ్య బీమా సరిపోకపోవచ్చు. దీంతో కుటుంబంలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా మరో రూ.5 లక్షల ఆరోగ్య బీమా అమలు చేస్తున్నారు.

పీఎంజేఏవై పథకంలోనే దీన్ని విస్తరించారు. ధన్వంతరి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డులను అందిస్తున్నారు. ఈ కార్డు పొందడానికి 70 ఏళ్లు దాటిన వారందరూ అర్హులే. వారందరికీ ఆరోగ్య బీమా అందుతుంది. అలాగే పేద, మధ్య తరగతి, ధనికులు భేదం లేకుండా నిర్ణీత వయసు ఉన్నవారందరికీ ఈ పథకంలో వైద్య సేవలు అందుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి