రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ మరియు క్రెడిట్ కార్డులకు సంబంధించి అక్టోబర్ 1 నుండి కొత్త నిబంధనను విడుదల చేసింది . ఈ నియమం ప్రకారం.. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ డేటాను ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్, యాప్ లావాదేవీల కోసం ప్రత్యేకమైన టోకెన్‌గా మార్చాలి. ఈ కొత్త నిబంధనలో వ్యాపారి లేదా ఆన్‌లైన్ వాణిజ్య సైట్‌లలో కార్డ్ వివరాలు అందించబడవు. ఈ నిబంధనను అమలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. గతంలో దీని గడువు జూన్ 30, దానిని సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. టోకనైజేషన్ కారణంగా, కస్టమర్లకు తమ కార్డ్‌కి సంబంధించి గరిష్ట భద్రత ఉంటుంది. దీని వల్ల కార్డు వివరాలు లీక్ అయ్యే అవకాశం ఉండదు.
రిజర్వ్ బ్యాంక్ వివరాల ప్రకారం.. టోకనైజేషన్ అంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ డేటాను కోడ్‌గా మార్చడం. ఇక్కడ కోడ్‌నే టోకెన్ అంటారు. ఈ టోకెన్‌లోని కార్డు వివరాలు. కార్డును ఉపయోగిస్తున్న వ్యాపారి లేదా ఆన్‌లైన్ సైట్ వివరాలు కార్డు జారీ చేసే కంపెనీకి పంపబడతాయి. దీని తర్వాత కార్డు జారీ చేసే సంస్థ పూర్తి వివరాలను కోడ్ రూపంలో తయారు చేసి వ్యాపారికి పంపుతుంది. ఇది సెకన్లలో చేయబడుతుంది. కస్టమర్ అనవసరమైన జాప్యాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. టోకనైజేషన్ కోసం RBI 6 దశలను అందించింది.
.@RBI Kehta Hai..
Want to generate a token for your debit/ credit card? Follow these 6 simple steps to tokenisation. It’s simple, it’s safe, it’s convenient.#BeAware #BeSecure#rbikehtahai #StaySafe #Tokenisationhttps://t.co/mKPAIpnAObhttps://t.co/RWS9vBbEZH pic.twitter.com/vTyBBeTCDH— RBI Says (@RBIsays) July 27, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి