మార్చి 31లోపు శాశ్వత ఖాతా సంఖ్య (PAN)ని ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఆ తేదీలోపు ఈ పని చేయకపోతే మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 31లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, మీ పాన్ నిరుపయోగంగా లేదా నిష్క్రియంగా మారుతుంది. మీ PAN నిష్క్రియంగా మారినట్లయితే, మీరు ఆర్థిక లావాదేవీలను చేయలేరు. మీరు బ్యాంకు ఖాతాను తెరవలేరు. షేర్లు ..మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టలేరు. పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించే చట్టం 2017 బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు.
ఇప్పటికే PAN – Aadhaar అనుసంధానం తుది గడువును ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతానికి ఈ ఏడాది మార్చి 31 ఆఖరు తేదీగా నిర్ణయించింది. ప్రభుత్వం మరోసారి తుదిగడువు పొడిగిస్తుందో లేదో స్పష్టత లేదు. అందుకే ఇంతవరకు పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోని వారు.. ఎంత వీలైతే అంత త్వరగా చేసుకుంటే మంచిది. లేకుంటే రూ.10వేల వరకు జరిమానా కట్టి మళ్లీ పాన్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది.
లింక్ చేసుకోండిలా..
1. ముందుగా ఏదైనా వెబ్ బ్రౌజర్‌లోకి వెళ్లి ఇన్‌టాక్స్ పోర్టల్ https://www.incometax.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం క్విక్ లింక్స్ అనే సెక్షన్‌లో లింక్ ఆధార్ (Link Aadhar) అనే ఆప్షన్ కనిపిస్తుంది.
2. లింక్ ఆధార్‌పై క్లిక్ చేశాక పాన్ (PAN) నంబర్, ఆధార్ నంబర్, ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
3. అనంతరం కింద ఉండే లింక్ ఆధార్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ పాన్ కార్డ్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్ క్లిక్ చేస్తే పాన్ – ఆధార్ లింక్ అయిపోతుంది. ఒకవేళ ఆధార్, పాన్ కార్డు వివరాలు వేరువేరుగా ఉంటే లింక్ కాదు. వేరువేరుగా వివరాలు ఉన్నవారు.. ఎందులో తప్పుగా ఉంటే దాన్ని అప్‌డేట్ చేసుకోవాలి.
Read Also.. Armed Forces Flag Day: అమరజవాన్ల ఫ్యామిలీలకు అండగా ఎస్బిఐ.. గవర్నర్ తమిళసై కు భారీ విరాళం అందజేత