దేశంలో ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఇటీవల యూపీఐని క్రెడిట్ కార్డ్‌లతో లింక్ చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి చాలా బ్యాంకులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐతో లింక్ చేసే సదుపాయాన్ని ప్రారంభించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పేరు కూడా చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌పీసీఐ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌ని సులభంగా యూపీఐ ఐడీకి లింక్ చేయవచ్చు.
హెచ్‌డిఎఫ్‌సి రూపే క్రెడిట్ కార్డ్‌ని యుపిఐతో లింక్ చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తర్వాత కోట్లాది మంది బ్యాంక్ కస్టమర్‌లు దాని ప్రయోజనం పొందుతారు. దీనితో వినియోగదారులు యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డును ఉపయోగించుకునే అవకాశాన్ని పొందుతారు. దీనితో పాటు డిజిటల్ యూపీఐ చెల్లింపు కూడా దేశంలో ఊపందుకుంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు, మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే క్రెడిట్ కార్డ్, ఇండియన్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఈ మూడు బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేసే ప్రక్రియ హెచ్‌డిఎఫ్‌సి మాదిరిగానే ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం