
మన దేశంలో కొన్ని పత్రాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిల్లో మొదటిది ఆధార్ కార్డు అయితే, రెండోవది పాన్ కార్డు. ఆధార్ కార్డు అనేది ఒక భారతీయ పౌరునిగా ఒక గుర్తింపు లాంటిది కాగా.. పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డు ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది. ఈ కార్డు ఉంటేనే బ్యాంకింగ్ సేవలు పొందగలం. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా లేదా ఆస్తి కొనుగోలు చేయాలన్నా ఇది ఉండాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో పాన్ కార్డు కనిపించకుండా పోవచ్చు. లేదా పర్సు పోయిన సందర్భంలో కార్డు మిస్ అవ్వొచ్చు. అలాంటి సమయంలో కొత్త కార్డు కావాలంటే ఎలా? లేదా ఆన్ లైన్ అప్పటికప్పుడు ఈ-పాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..
సాధారణంగా కార్డు పోయిన సందర్భంలో మరో కార్డు అప్లై చేయాలంటే అధీకృత కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ-పాన్ కార్డు కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే కేవలం పది నిమిషాల్లో కార్డును పొందొచ్చు. అదెలా అంటే..
ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సాధ్యం అవుతుంది. ఆ పోర్టల్లో ఈ-పాన్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ సేవ ద్వారా మీ ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి పూర్తి చేయవచ్చు. అయితే మీ ఆధార్ పాన్‌తో లింక్ అయ్యి ఉండాలి. రెండింటికీ అనుసంధానమైనా మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. ఈ-పాన్‌ను రూపొందించడం వల్ల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఆఫ్‌లైన్ ప్రాసెస్‌ల అవసరాన్ని కూడా తొలగిస్తుంది.
చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్ ఉన్న వినియోగదారులకు తక్షణ పాన్ కార్డ్‌లను అందించడానికి ఈ-పాన్ సేవను రూపొందించారు. ఆధార్‌తో లింక్ అయిన ఈ-కేవైసీ ధ్రువీకరణ ద్వారా వినియోగదారు వివరాలను ధ్రువీకరించిన తర్వాత ఈ డిజిటల్ సంతకం చేసిన కార్డ్‌లు దాదాపు జారీ అవుతాయి. వినియోగదారులు ఈ-పాన్ ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉచితంగా అందుకుంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..