EX-Servicemen : మాజీ సైనికులకు పెన్షన్ ఎలా ఇస్తారో మీకు తెలుసా.. సోమవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలు తెలిపింది. పెన్షన్‌కు ఎలా అర్హులు అవుతారు.. ఎంత ప్రయోజనం పొందుతారు తదితర విషయాలు స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా మాజీ సైనికులకు పెన్షన్ పథకంలో ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. రాజ్యసభలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ సమాచారం ఇచ్చారు. సర్వీస్ పెన్షన్ పొందడానికి, కమీషన్డ్ ఆఫీసర్లకు 20 సంవత్సరాల సర్వీస్, ఆఫీసర్ ర్యాంక్ కంటే తక్కువగా ఉండే సైనికులకు 15 సంవత్సరాల సర్వీస్ ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు అనేక సెంట్రల్ పే కమిషన్లు ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా మాజీ సైనికుల పెన్షన్‌లో మార్పులు చేశారని గుర్తు చేశారు. ఇది కాకుండా అనేక ప్రభుత్వ పాలసీకి సంబంధించిన లేఖలు కూడా జారీ చేశారు. దీని కారణంగా పెన్షన్ కూడా పెరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మాజీ సైనికులకు ఈ విధంగా పెన్షన్ చెల్లిస్తున్నారు.
పెన్షన్ రకాలు..
1. ఉద్యోగ విరమణ పెన్షన్ / సర్వీస్ పెన్షన్
2. రిటైరింగ్ గ్రాట్యుటీ లేదా సర్వీస్ గ్రాట్యుటీ
3. స్పెషల్ పెన్షన్ / స్పెషల్ గ్రాట్యుటీ
4. రిటైర్మెంట్ గ్రాట్యుటీ / డెత్ గ్రాట్యుటీ
5. డిసెబెలిటీ పెన్షన్ / వార్ గాయం పెన్షన్
6. ఆర్డినరీ ఫ్యామిలీ పెన్షన్ / స్పెషల్ ఫ్యామిలీ పెన్షన్ / లిబర్లైడ్ ఫ్యామిలీ పెన్షన్
7. ఆధారిత పెన్షన్ / సరళీకృత కుటుంబ పెన్షన్
8. కుటుంబ గ్రాట్యుటీ
ఈ సంవత్సరం బడ్జెట్‌లో పెన్షన్ తగ్గించారు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ఫిబ్రవరి 1 న 2021-22కి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్‌లో మాజీ సైనికుల పెన్షన్ మొత్తాన్ని కూడా తగ్గించారు. పెన్షన్ కోసం రూ.1.15 లక్షల కోట్లు కేటాయించారు. గత సంవత్సరం బడ్జెట్‌లో రూ.1.33 లక్షల కోట్లు కేటాయించారు. దీని ప్రకారం ఈ సంవత్సరం దాదాపు 18 వేల కోట్లు తగ్గాయి. గత ఏడాది రూ.18,000 కోట్లు పెన్షనర్ల బకాయిలు చెల్లించారు. అయితే ఈ పెన్షన్ కోత సైనికుల పెన్షన్ పై ఎలాంటి ప్రభావం చూపదు. సైనికుల ఉద్యోగ విరమణ వయస్సును కేంద్ర ప్రభుత్వం పెంచబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్ల బడ్జెట్ మొత్తం తగ్గించారు. ప్రస్తుతం భారతదేశంలో మూడు సైన్యాలకు చెందిన 24 లక్షల మంది మాజీ సైనికులు ఉన్నారు.