PM Kisan: త్వరలో రైతులందరికీ అకౌంట్లోకి రూ.2 వేలు.. మీకు వస్తాయో..? రావో? ఇలా చెక్ చేసుకోండి..

దేశవ్యాప్తంగా రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఫిబ్రవరిలో పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుంది. ఈ మేరకు రూ.2 వేలు రైతుల అకౌంట్లో నేరుగా జమ చేయనుంది. ఈ క్రమంలో మీకు అందుతాయో.. లేదో చెక్ చేసుకోవడం ఎలా అంటే..

PM Kisan: త్వరలో రైతులందరికీ అకౌంట్లోకి రూ.2 వేలు.. మీకు వస్తాయో..? రావో? ఇలా చెక్ చేసుకోండి..
Pm Kisan Money

Updated on: Jan 11, 2026 | 3:24 PM

దేశంలోని రైతులందరికీ త్వరలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను త్వరలోనే రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు సిద్దమవుతోంది. ఫిబ్రవరిలో పీఎం కిసాన్ నిధులను కేంద్రం రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేయనుంది. ఇందుకోసం ప్రాసెస్ జరుగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే స్వయంగా తన చేతుల మీదుగా పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. ప్రతీ ఏడాది ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు రూ.6 వేల సహాయం అందిస్తోంది. వీటిని రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా జమ చేస్తున్నారు. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున వీటిని విడుదల చేస్తూ వస్తోంది. 5 ఎకరాల్లోపు పోలం ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చుతోంది.

ఫిబ్రవరిలో నిధులు విడుదల

దాదాపు దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ లబ్దిదారులుగా ఉన్నారు. 22వ విడత డబ్బులను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయిన క్రమంలో లబ్దిదారులు మీకు పీఎం కిసాన్ నిధులు వస్తాయా.. లేదా అనేది ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రాకపోతే ఎందుకు రాలేదనే రీజన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇటీవల అనర్హులుగా తేలిన కొంతమంది రైతులను లబ్దిదారుల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. మీ పేరు లబ్దిదారుల జాబితాలో ఉంటేనే నగదు జమ అవుతాయి.

మీకు డబ్బులు వస్తాయో..? రావో? చూసుకోవడమెలా..

-https://pmkisan.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లాలి
-Know Your Status ఆప్షన్ ఎంచుకోవాలి
-రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి
-ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి
-22వ ఇనాస్టాల్‌మెంట్ మీకు వస్తుందో రాదో అక్కడ తెలుసుకోవచ్చు.

లబ్దిదారుల జాబితా చెక్ చేయాలంటే..?

-https://pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
-Farmers Corner ఆప్షన్ ఎంచుకుని Beneficiary Listపై క్లిక్ చేయాలి.
-మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోవాలి
-గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయాలి

-మీ గ్రామంలోని లబ్దిదారుల జాబితా వస్తుంది

-మీ పేరు ఉందో.. లేదో చెక్ చేసుకోండి

కేవైసీ చేసుకోండి

ఒక్కొసారి కేవైసీ పెండింగ్‌లో ఉండటం వల్ల మీ అకౌంట్లో డబ్బులు పడవు. అందుకే బ్యాంక్‌కు వెళ్లి కేవైసీ పూర్తి చేయాలి. ఇందుకోసం మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన ఆధార్ నెంబర్ ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేస్తే మీ అకౌంట్లో నిధులు జమ అవుతాయి.