PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి రూ.2వేలు.. మీ పేరు ఉందో లేదో మొబైల్‏‏లోనే ఇక సులభంగా ఇలా చెక్ చేయండి..

|

May 15, 2021 | 4:02 PM

PM Kisan Samman Nidhi: దేశంలోని అన్నదాతలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను తీసుకువచ్చింది.

PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి రూ.2వేలు.. మీ పేరు ఉందో లేదో మొబైల్‏‏లోనే ఇక సులభంగా ఇలా చెక్ చేయండి..
Pm Kisan
Follow us on

PM Kisan Samman Nidhi: దేశంలోని అన్నదాతలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను తీసుకువచ్చింది. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం. ఇందులో రైతులకు కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు అందిస్తోంది. మోదీ ప్రభుత్వం రైతులకు చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ. 6 వేలు అందిస్తుంది. అయితే ఈ డబ్బు మొత్తాన్ని విడతలుగా వారి ఖాతాల్లో జమ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు 7 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయిన సంగతి తెలిసిందే. తాజా 8వ విడత డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

ఇప్పటివరకు 9.5 కోట్ల మంది రైతులకు అకౌంట్లలోకి రూ.20 వేల కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసింది. కరోనా కష్ట కాలంలో రైతులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు . అయితే  కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను ఏప్రిల్ నెలలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ ఈసారి ఈ డబ్బులు చాలా ఆలస్యంగా వచ్చాయని చెప్పుకోవచ్చు ఈ పథకం కింద ప్రభుత్వం 33 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించింది. వారి ఖాతాలకు ఈ డబ్బు జమ చేయలేదు. అలాగే పిఎం కిసాన్ అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ జాబితాలో మీరు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ సందర్శించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి బెనిఫీసియరీ స్టేటస్‌పై క్లిక్ చేసి డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు.

Also Read: ఎల్ఐసీలో అదిరిపోయే స్కీమ్.. ఇందులో చేరితే ప్రతి 3 నెలలకు డబ్బులు.. ఒకేసారి రూ.10 వేలు అందుకునే..

కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన… అయోమయంలో కస్టమర్లు..

చనిపోయిన వారి అకౌంట్‏లో నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా.. నామినీ లేకపోతే ఎలా..