ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జులై 31తో గడువు ముగిసింది. ఏ కారణంతోనైనా గడువు తేదీలోపు రిటర్నులు దాఖలు చేయని వారికి మరో అవకాశం కూడా ఉంది. లేట్ ఫీతో కలిపి డిసెంబరు 31లోపు రిటర్నులు దాఖలు చేసుకునేందకు అవకాశం ఉంది. అయితే, పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేసిన వెంటనే.. చేయాల్సిన ముఖ్యమైన పని వెరిఫికేషన్ పూర్తిచేయడం. అయితే.. చాలా మంది వ్యక్తులు 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేశారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022. ఐటీఆర్ దాఖలు చేయనందుకు భారీ జరిమానా పడే అవకాశం ఉంది. దీంతో ఈసారి భారీ సంఖ్యలో ఐటీఆర్ దాఖలు చేశారు. ITR ఫైల్ చేసే సమయంలో, వివిధ వ్యక్తుల TDS రిటర్న్ కూడా జనరేట్ చేయబడుతుంది. ఇది సాధారణంగా ITR ఫైల్ చేసిన 15 నుంచి 20 రోజులలోపు అందుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో అది జరగదు.. రిటర్నులు నిలిచిపోతాయి. మీరు మీ TDS రీఫండ్ స్టేటస్‌ని ఎలా చెక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.
స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
అయితే, మీరు మీ ITRని ఏదైనా CA లేదా CS ద్వారా నింపారు. కానీ ఆ ITR తర్వాత స్వీకరించిన TDS రీఫండ్ స్టేటస్‌ని కూడా మీరు చెక్ చేయవచ్చు. దీన్ని తెలుసుకునే మార్గం కూడా చాలా సులభం. మీ TDS స్టేటస్‌ని ఆన్‌లైన్‌లో ఎలా తెలుసుకోవాలో ఇవాళ మనం మీకు తెలుసుకుందాం.
రీఫండ్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి ఇక్కడ మరొక మార్గం ఉంది
మరిన్ని బిజినెస్ వార్తల కోసం