
Bank Home Loan
ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో మనం ఉన్నాం.. అంతా సెల్ ఫోన్లోనే ఫింగర్ టిప్స్ పై నడిచే వ్యవస్థలు అందుబాటులోకొ వచ్చాయి. ఆన్ లైన్ చెల్లింపులు, వ్యాపారం, అమ్మడం, కొనడం, బ్యాంకింగ్ అన్ని చాలా సింపుల్ గా సెల్ ఫోన్ సాయంతోనే చేసేయొచ్చు. అంతలా సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇదే క్రమంలో బ్యాంకులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం బ్యాంక్ బ్రాంచ్ వెళ్లాల్సిన అవసరం పెద్దగా ఏమి రావడం లేదా. సమస్తం బ్యాంక్ యాప్స్ లో ఉంటుండంతో అందరూ వీటిని వినియోగించుకుంటున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు వ్యవస్థను సౌకర్యవంతంగా మార్చేశాయి. అలాగే లోన్లు కూడా ఆన్ లైన్లోనే తీసుకునే వెసులుబాటు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. పర్సనల్ లోన్లు దాదాపు ఆన్ లైన్లోనే మంజూరవుతున్నాయి. ఇటీవల కాలంలో హోమ్ లోన్లు కూడా ఆన్ లైన్లోనే కొన్ని బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. వాటిల్లో హెచ్‌డీఎఫ్సీ బ్యాంకు కూడా ఉంది. హెచ్ డీ ఎఫ్సీ బ్యాంకులో హోమ్ లోన్ ఆన్ లైన్ విధానం గురించి ఎప్పుడు తెలుసుకుందాం..
సమయం ఆదా చేయడం కోసం..
మార్కెట్ వాటా పరంగా భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్ డీఎఫ్సీ వినియోగదారులకు అన్ని సేవలను ఆన్ లైన్లో అందిస్తోంది. అలాగే ఆన్‌లైన్ గృహ రుణాలను కూడా అందిస్తోంది. వాస్తవానికి గృహ రుణం కావాలంటే అవసరమైన డాక్యుమెంట్లతో పాటు లోన్ ప్రొవైడర్ కార్యాలయాన్ని సందర్శించి, చర్చించి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాంకు తమ వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడంతో వేగంగా ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం దరఖాస్తులను అందిస్తోంది. అయితే దీనిపై కొంతమందికి అపోహలు ఉన్నాయని, ఏమైనా తప్పులు జరుగుతాయేమోనని భయపడతారని బ్యాంక్ పేర్కొంది. అయితే వాస్తవానికి ఇక్కడ తప్పు జరగడానికి చాలా తక్కువ ఆస్కారం ఉందని, లోన్ ప్రక్రియ సులభంగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చని బ్యాంక్ తన వెబ్ సైట్లో పేర్కొంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ దరఖాస్తు ఇలా..
- బ్యాంకు అధికారిక వెబ్ సైట్ (https://www.hdfc.com)ను సందర్శించండి.
- హోమ్ పేజీలో ‘హోమ్ లోన్ కోసం దరఖాస్తు’పై క్లిక్ చేయండి.
- మీ అర్హత ఉన్న లోన్ మొత్తాన్ని చూడటానికి ‘అర్హతను తనిఖీ చేయండి’పై క్లిక్ చేయండి.
- ‘ప్రాథమిక సమాచారం’ ట్యాబ్ కింద రుణ రకాన్ని ఎంచుకోండి.
- మీరు ప్రాపర్టీని షార్ట్‌లిస్ట్ చేసి ఉంటే ‘అవును’ క్లిక్ చేయండి, లేకపోతే ‘నో’ ఎంచుకోండి.
- మీ పేరు ఇతర సమాచారం నింపండి. గరిష్టంగా 8 మంది కలిసి సంయుక్తంగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ‘దరఖాస్తుదారులు’ ట్యాబ్ కింద, మీ నివాస స్థితిని (భారతీయ / ఎన్ఆర్ఐ) ఎంచుకుని, అవసరమైన అన్ని వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.
- ‘ఆఫర్‌లు’ ట్యాబ్‌లో వెళ్లి అన్ని రుణ ఉత్పలు, సమాచారం ఉంటుంది. వాటిని ఓ సారి పరిశీలించడండి.
- లోన్ ఉత్పత్తి కోసం, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, ‘సమర్పించు’పై క్లిక్ చేయండి.
- మీరు అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడంతో ఆన్‌లైన్ లోన్ అప్లికేషన్ పూర్తవుతుంది.
అర్హతా ప్రమాణాలు ఇలా..
- హోమ్ లోన్ అర్హతను నిర్ణయించడంలో మీ వయస్సు కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఎంత చిన్నవారైతే, హోమ్ లోన్ ఆమోదం పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. అలాగే, మీరు చిన్న వయస్సులో ఉన్నప్పుడు, మీరు ఎక్కువ కాలానికి లోన్ పొందవచ్చు.
- ఆదాయ స్థిరత్వం, ఆదాయ పరిమాణం మీరు తీసుకునే మొత్తాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
- మీరు జీతం పొందే ఉద్యోగి అయినా లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారైనా, మీకు స్థిరమైన ఆదాయం ఉండాలి.
- అధిక క్రెడిట్ స్కోర్, క్లీన్ రీపేమెంట్ రికార్డ్‌లు వేగవంతమైన లోన్ ఆమోదం పొందే అవకాశాలను మెరుగుపరుస్తాయి.
రుణదాతలు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, కారు రుణాలు మొదలైన ప్రస్తుత బాధ్యతలను అంచనా వేస్తారు.
- గృహ రుణాన్ని తిరిగి చెల్లించే ఆర్థిక సామర్థ్యం మీకు ఉందని నిర్ధారించుకుంటారు.
మీకు ఎటువంటి బాధ్యతలు లేకుంటే, మీరు ఎటువంటి అవాంతరాలు లేకుండా మీ రుణాన్ని ఆమోదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..