ప్రారంభమైన LIC-IPO.. షేర్ల కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? ఆన్ లైన్ లో ఇలా చేయండి!

|

May 04, 2022 | 11:26 AM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) IPO ఈరోజు అంటే మే 4న ప్రారంభమైంది. ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాను ఐపీఓ ద్వారా ప్రభుత్వం విక్రయిస్తోంది. దీని ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించే ఆలోచనలో ఉంది.

ప్రారంభమైన LIC-IPO.. షేర్ల కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? ఆన్ లైన్ లో ఇలా చేయండి!
How To Apply For Lic Ipo
Follow us on

LIC-IPO: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) IPO ఈరోజు అంటే మే 4న ప్రారంభమైంది. ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాను ఐపీఓ ద్వారా ప్రభుత్వం విక్రయిస్తోంది. దీని ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించే ఆలోచనలో ఉంది. మీరు కూడా ఇందులో డబ్బును పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఇందులో ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? ఎలా పెట్టుబడి పెట్టవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టగల కనీస మొత్తం అలాగే గరిష్ట మొత్తం ఎంత?

రిటైల్ పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్ అంటే 15 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు రూ.45 తగ్గింపు తర్వాత కనీసం రూ.13,560 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి 14 లాట్లు, అంటే 210 షేర్లు. పెట్టుబడిదారులు గరిష్టంగా రూ.1,89,840 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదేవిధంగా, పాలసీదారులు రూ.60 తగ్గింపు తర్వాత కనిష్టంగా రూ.13,335 అలాగే గరిష్టంగా రూ.1,86,690 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, పాలసీదారులతో పాటు ఉద్యోగులకు కూడా అదనపు ప్రయోజనం ఉంటుంది.

దీనికి ఏదైనా తగ్గింపు లభిస్తుందా?

రిటైల్ ఇన్వెస్టర్లకు ఎల్‌ఐసీ రూ.45 తగ్గింపును ఉంచింది. మీరు ఎగువ బ్యాండ్‌లో ఒక లాట్ షేర్‌ల కోసం దరఖాస్తు చేస్తే, ఒక్కో షేరుకు రూ. 949 బదులుగా, మీరు ఒక్కో షేరుకు రూ. 904 చెల్లించాలి. అంటే, ఒక లాట్‌కు మీరు 14,235కి బదులుగా రూ.13,560 మాత్రమే చెల్లించాలి.

మీరు LIC పాలసీని కలిగి ఉంటే, మీకు షేర్లు చౌకగా లభిస్తాయి..

మీరు LIC పాలసీని కలిగి ఉంటే, మీకు 60 రూపాయల తగ్గింపు లభిస్తుంది. మీరు పాలసీ హోల్డర్ కోటా నుండి ఎగువ బ్యాండ్‌లోని ఒక లాట్ షేర్ల కోసం దరఖాస్తు చేస్తే, మీరు ఒక్కో షేరుకు రూ. 889 చెల్లించాలి. అంటే, ఒక లాట్ కోసం మీరు 14,235 బదులుగా రూ. 13,335 చెల్లించాలి.

డీమ్యాట్ ఖాతా అవసరమా?

సెబీ నిబంధనల ప్రకారం, ఏదైనా కంపెనీ ఈక్విటీ షేర్లు డీమ్యాట్ రూపంలో మాత్రమే జారీ చేస్తారు. అందువల్ల పాలసీ హోల్డర్లు లేదా రిటైల్ ఇన్వెస్టర్లు ఎవరైనా డీమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి.

ఎలా అప్లై చేయాలి?

మీరు దీని కోసం ఆన్‌లైన్.. ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు మీ డీమ్యాట్ ఖాతా ద్వారా లేదా దాని యాప్ ద్వారా IPO కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 3 వర్గాల ఆప్షన్స్ చూస్తారు.

  1. రిటైల్
  2. పాలసీదారు
  3. ఉద్యోగి

మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న వర్గంపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు కావలసిన లాట్‌ల సంఖ్యను పూరించండి. దీని తర్వాత లాట్ ధర డబ్బు మీ ఖాతా నుంచి బ్లాక్ అవుతుంది. తరువాత మే 12 న, మీరు షేర్ కేటాయింపులో వాటాలను పొందినట్లయితే, మీ ఖాతా నుంచి డబ్బు డెబిట్ అవుతుంది. మే 16 న, మీ డిమ్యాట్ ఖాతాలోషేర్లు జమ అవుతాయి. దీని తర్వాత, ఎల్‌ఐసి స్టాక్ మే 17న మార్కెట్‌లో లిస్ట్ అవుతుంది.

మరోవైపు, మీకు షేర్లు రాకపోతే, మీ డబ్బును అన్‌బ్లాక్ చేసే ప్రక్రియ మే 13 నుంచి ప్రారంభమవుతుంది. అటువంటపుడు, మీ డబ్బు 1-2 రోజుల్లో అన్‌బ్లాక్ చేస్తారు. మరోవైపు, మీరు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు ఎల్‌ఐసి కార్యాలయం లేదా మీ డీమ్యాట్ ఖాతా కంపెనీ కార్యాలయాన్ని సంప్రదించాలసి ఉంటుంది. అక్కడ మీరు దీనికి సంబంధించిన ఫారమ్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

డబ్బు తగ్గింపు పెట్టుబడి ఏ ధర వద్ద?

LIC IPO ధర బ్యాండ్ రూ. 904-949. ఈ నేపధ్యంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారు అధిక బ్యాండ్ రూ 949 పై డబ్బును పెట్టుబడి పెట్టాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

CIA CTO: అమెరికా గూఢచార సంస్థలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి.. చరిత్రలో తొలిసారిగా..

Tata Motors: ఏప్రిల్ లో సూపర్ సేల్స్ నమోదు చేసిన టాటా మోటార్స్.. ప్రత్యర్థి కంపెనీలు డీలా..