Jeff Bezos Wedding: వధువు దుస్తులకే 12 కోట్లు.. అమెజాన్ వ్యవస్థాపకుడి పెళ్లికి ఖర్చు ఎంతో తెలిస్తే షాకవుతారు

Jeff Bezos Wedding: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. వివాహానికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అమెజాన్ వ్యవస్థాపకుడి వివాహ ఖర్చులను తెలుసుకోవడానికి కూడా ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. గురువారం వివాహానికి ముందు వేడుకల తర్వాత శుక్రవారం వివాహం జరిగింది..

Jeff Bezos Wedding: వధువు దుస్తులకే 12 కోట్లు.. అమెజాన్ వ్యవస్థాపకుడి పెళ్లికి ఖర్చు ఎంతో తెలిస్తే షాకవుతారు

Updated on: Jun 29, 2025 | 3:31 PM

Jeff Bezos Wedding Cost: మూడు రోజుల వేడుకల తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్‌లో జరిగిన ఈ విలాసవంతమైన వివాహానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. వివాహానికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అమెజాన్ వ్యవస్థాపకుడి వివాహ ఖర్చులను తెలుసుకోవడానికి కూడా ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. గురువారం వివాహానికి ముందు వేడుకల తర్వాత శుక్రవారం వివాహం జరిగింది.

వివాహానికి ఖచ్చితమైన ఖర్చు ఎంత అనేది తెలియదు. jelw జెఫ్ బెజోస్ ఏకంగా 55 మిలియన్ డాలర్లు (రూ.548 కోట్లు) ఖర్చుపెట్టినట్టు సమాచారం. యూరప్‌లో ఇంత భారీ వెడ్డింగ్ ఇదే అని తెలుస్తోంది. ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా బెజోస్‌ తన ప్రియురాలికి 2.5 మిలియన్‌ డాలర్ల విలువైన డైమండ్‌ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. కాగా, ఈ వివాహానికి 200 మందికి పైగా అతిథులు హాజరైనట్టు తెలుస్తోంది. రేపు సాయంత్రం ముగింపు పార్టీతో వివాహ వేడుకలు ముగుస్తాయి. లేడీ గాగా, ఎల్టన్ జాన్ కూడా ప్రదర్శన ఇస్తారని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Vehicles Policy: ఆ వాహనాలకు షాకింగ్‌ న్యూస్‌.. ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఇవి కూడా చదవండి

వధువు లారెన్ సాంచెజ్ దుస్తుల ధర దాదాపు 12 కోట్లు అని అంతర్జాతీయ మీడియా నివేదించింది. సాంచెజ్ తెల్లటి మెర్మైడ్-లైన్ గౌను ధరించింది. వివాహ దుస్తులను ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ డోల్స్ అండ్‌ గబ్బానా రూపొందించింది. జెఫ్ బెజోస్ నల్లటి కోటు, సూట్ ధరించాడు. బెజోస్, సాంచెజ్ బుధవారం హెలికాప్టర్ ద్వారా వెనిస్ చేరుకున్నారు. లగ్జరీ అమన్ హోటల్‌లో బస చేశారు. అక్కడ గదుల ధర రాత్రికి కనీసం 4,000 యూరోలు (సుమారు రూ. 4 లక్షలు).

ఇది కూడా చదవండి: Indian Railways: భారతీయ రైల్వేలలో ఎన్ని రకాల సీట్లు ఉంటాయి? ఎవరికి ఎలాంటి బెర్త్ కేటాయిస్తారు?

ఈ పెళ్లికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్‌ఫ్రే, కిమ్ కర్దేషియాన్, కోలే కర్దేషియాన్, జోర్డాన్ రాణి రనియా తదితరులు హాజరయ్యారు. కాగా, వివాహం అనంతరం ఫొటోలను లారెన్ శాంచెజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన పేరును లారెన్ శాంచెజ్ బెజోస్‌గా మార్చుకున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి