
Google Income: గూగుల్ మనకు అనేక సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా గూగుల్ ఎలాంటి ప్రత్యక్ష రుసుము లేకుండానే తన సేవలను అందుబాటులోకి తెచ్చింది. అయితే గూగుల్ ఇంత పెద్ద కంపెనీగా ఎలా మారింది? దానికి ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి గూగుల్ మన నుండి డబ్బులు అడగదు. కానీ అంతకంటే విలువైన మన డేటాను సేకరిస్తుంది.
గూగుల్ మన పేరు, మనం సెర్చ్ చేసే అంశాలతో సహా మన పూర్తి వివరాలను విశ్లేషిస్తుంది. ఈ డేటాను కంపెనీలకు అందిస్తుంది. కంపెనీలు మన అభిరుచులకు తగ్గట్టు ప్రకటనలను రూపొందించి గూగుల్‌కు అందిస్తాయి. గూగుల్ ఆ ప్రకటనలను వినియోగదారులకు ప్రదర్శించి, తద్వారా డబ్బు సంపాదిస్తుంది. 2024లో గూగుల్ మొత్తం ఆదాయం 29 లక్షల కోట్లు కాగా, అందులో 80 శాతం ప్రకటనల ద్వారానే వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అందుకే గూగుల్ సేవలు ఉచితం కావు. ఈ ప్రపంచంలో ఎవరూ ఏదీ ఉచితంగా ఇవ్వరు. ప్రతి ఒక్కరికీ వారి స్వార్థం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Credit Card: క్రెడిట్ కార్డు నుండి నగదు విత్‌డ్రా చేస్తున్నారా? మీ పని అయిపోయినట్లే..!
గూగుల్ సెర్చ్, మ్యాప్స్, Gmail వంటి అనేక సేవలను ఉచితంగా అందిస్తుంది. కానీ ఈ సేవలను నిర్వహించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రకటనల ద్వారా డబ్బు సంపాదిస్తుంది. వ్యాపారాలు తమ ప్రేక్షకులకు చేరుకోవడానికి గూగుల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తాయి. దీని ద్వారా గూగుల్‌కు, కంటెంట్ సృష్టికర్తలకు ఆదాయం లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి