Credit Cards
ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు క్రెడిట్ కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. బ్యాంకు అధికారుల విచారణ, ఇతర పత్రాల పరిశీలతో పాటు కఠినమైన రూల్స్ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటివేమి లేవు. సులభంగా క్రెడిట్ కార్డును పొందవచ్చు. బ్యాంకు సిబ్బంది కేవలం కస్టమర్లకు ఫోన్‌ల ద్వారా సంప్రదించి ఆన్‌లైన్‌లోనే వివిధ పత్రాలు సమర్పించుకుని క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నారు. వివిధ రకాల ఆఫర్లు ఉన్నాయంటూ అధిక మొత్తంలో కార్డులను మంజూరు చేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు ఉంటే ఇబ్బడి ముబ్బడిగా షాపింగ్స్ చేస్తే జాగ్రత్తగా ఉండాలి. బిల్ జనరేట్ అయిన తర్వాత సమయానికి బిల్లు చెల్లించాలి. లేదంటే మీకు అదనపు ఛార్జీలతో పాటు మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని బ్యాంకు నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఇప్పుడు పండగ సీజన్‌లు ఉన్నాయి. ఈ నెలలో క్రిస్మస్, కొత్త సంవత్సరం, తర్వాత సంక్రాంతి పండగలున్నాయి. ఇలా పండగల సమయంలో షాపింగ్స్ జోరుగా చేస్తుంటారు. పండగ సీజన్‌లో వివిధ రకాల ఆన్‌లైన్ దిగ్గజాలు, వివిధ రకాల కంపెనీలు కొనుగోళ్లపై బంపర్ ఆఫర్లు ఇస్తుంటాయి. ఎక్కువగా క్రెడిట్, డెబిట కార్డులపై ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. ఇలాంటి ఆఫర్లను కస్టమర్ల సద్వినియోగం చేసుకుంటారు. కార్డు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కార్డుపై బ్యాలెన్స్ ఉంది కదా అని ఎడపెడ ఖర్చు చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
- క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తే..: పండగ సీజన్‌లో ఆఫర్ల ఇచ్చారు కదా అని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కానీ కార్డు చెల్లింపుల విషయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో మీ క్రెడిట్ కార్డుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా చెల్లించినట్లయితే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుంటుంది. ఆలస్యంగా చెల్లించినట్లయితే అధిక వడ్డీ పడుతుంది. అలాగే మీ క్రెడిట్ కార్డుపై కూడా నగదు తీసుకోవడానికి కూడా అనుతిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నగదు తీసుకునేందుకు ప్రయత్నించవద్దు. ఒక వేళ కార్డు నుంచి నగదు విత్‌డ్రా చేసినట్లయితే భారీగా వడ్డీ పడుతుంది. ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉంటే ట్రాన్సాక్షన్ లిమిట్ తక్కువగా పెట్టుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించొచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తు్న్నారు. అందుకే క్రెడిట్ కార్డు వాడుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాడుకోవాల్సి ఉంటుంది. లిమిట్ పెంచారు కదా అని దుబారా ఖర్చులు చేస్తే సమయానికి చెల్లించని పక్షంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
- రివార్డు పాయింట్లు: ఏదైనా క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు రివార్డు పాయింట్లు కూడా ఉంటాయి. మీరు షాపింగ్ చేసినదాని బట్టి మీకు రివార్డు పాయింట్లు వస్తుంటాయి. అలాంటి సమయంలో రివార్డు పాయింట్లను ఎప్పటికప్పుడు వాడుకోవడం మంచిది. లేకపోతే గడువు ముగిసిపోతే అవి వృథా అవుతుంటాయి. కొన్ని క్రెడిట్ కార్డులపై గడువు సంవత్సరం వరకు గడువు ఉంటుంది. కొన్ని కార్డులపై గడువు తక్కువగా ఉంటుంది. ఈ గడువు విషయాన్ని ముందుగానే గమనించడం మంచిది.
- సిబిల్ స్కోర్‌పై ప్రభావం: క్రెడిట్ కార్డుపై సిబిల్ స్కోర్ ఉండేలా చూసుకోవాలి. మీరు సరైన సమయంలో కార్డు బిల్లు చెల్లించనట్లయితే సిబిల్ స్కోర్ పడిపోతుంది. దీని వల్ల భవిష్యత్తలులో బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. బ్యాంకు నుంచి మీరు రుణం పొందాలంటే మీ సిబిల్ స్కోర్‌పై ఆధార పడి ఉంటుంది.
- క్రెడిట్ కార్డుపై లోన్: ఇవే కాకుండా మీ క్రెడిట్ కార్డు లిమిట్ ఎక్కువగా ఉంటే మీరు అంతే మొత్తం క్రెడిట్ కార్డుపై రుణం తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉండటం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంది కదా అని ఎక్కువగా క్రెడిట్ కార్డ్ వాడేస్తే అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి