Honda Bike: స్టైలిష్ లుక్..స్టన్నింగ్ ఫీచర్స్‌తో హోండా బైక్.. ధర ఎంతో తెలిస్తే షాక్..!
భారతదేశంలోని యువత ఇటీవల కాలంలో బైక్ రైడింగ్‌ను ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా అధునాతన బైక్స్‌ను కొనుగోలు చేసి నలుగురిలో తమ ప్రత్యేకతను చూపించుకోవాలని కోరుకునే వారు అధికంగా ఉంటున్నారు. యువతలో లాంగ్ రైడ్స్‌ను ఎంజాయ్ చేసే వారు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రీమియం బైక్స్ వాడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారి కోసం హోండా ప్రీమియం బైక్స్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఇటీవల రెబెల్ 500 పేరుతో ప్రీమియం బైక్‌ను భారతదేశంలో విడుదల చేసింది. రెబెల్ 500 డిజైన్ అందరినీ ఆకట్టుకుంటుంది. రెట్రో స్టైల్‌తో లెటెస్ట్ ఫీచర్స్‌తో ఈ బైక్ యువతకు ఆసక్తి కలిగిస్తుంది. ఇంధన ట్యాంక్‌తో పాటు మందపాటి హ్యాండిల్‌బార్లు ఈ బైక్‌కు స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. ఈ బైక్ మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ కలర్‌లో ఆకట్టుకుంటుంది. దీని సీటు ఎత్తు కేవలం 690 మి.మీ. అందువల్ల ఈ బైక్ ఆపరేట్ చేయడం సులభంగా ఉంటుంది. రెబెల్ 500 బైక్ 471సీసీ లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ బైక్ 34 కేడబ్ల్యూ శక్తిని, 43.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
రెబల్ 500 బైక్ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అందువల్ల పట్టణ ప్రాంతాలతో పాటు హైవేల్లో ఈ బైక్ మంచి పనితీరు చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ యువతను బాగా ఆకర్షిస్తుంది. ఈ బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో షోవా షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. అందువల్ల సౌకర్యవంతమైన రైడ్‌ను ఆశ్వాదించవచ్చు. అలాగే బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 296 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో 240 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ భద్రతతో డన్‌లప్ టైర్లతో వస్తుంది. ముఖ్యంగా ఈ బైక్‌లో ఇన్‌వర్టెడ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది.
రెబెల్ 500 బైక్‌ను హోండా షోరూమ్‌లో లేదా హోండా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రత్యేక శైలితో పాటు శక్తిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ బైక్ అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. హోండా రెబెల్ 500 ధర రూ.5.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ప్రీమియం క్రూయిజర్ బైక్ శైలితో పాటు పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ బైక్ గురుగ్రామ్, ముంబై, బెంగళూరులోని ఎంపిక చేసిన హోండా షోరూమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








