AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

June Bank Holidays: జూన్‌ నెలలో సగం రోజులు బ్యాంకులకు సెలవులే..!

వచ్చే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బ్యాంకుకు వెళుతున్నట్లయితే, వచ్చే నెలలో అంటే జూన్‌లో మీ నగరంలో ఎన్ని రోజులు బ్యాంకులు మూసివేయబడతాయో ముందుగానే తెలుసుకోవచ్చు.

June Bank Holidays: జూన్‌ నెలలో సగం రోజులు బ్యాంకులకు సెలవులే..!
Subhash Goud
|

Updated on: May 25, 2025 | 6:30 PM

Share

చాలా మందికి ప్రతి రోజు బ్యాంకు పని నిమిత్తం వెళ్తుంటారు. అయితే బ్యాంకుకు వెళ్లే ముందు ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయోనన్న విషయాన్ని కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మే నెల ముగిసి జూన్‌ నెల వచ్చేస్తోంది. వచ్చే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బ్యాంకుకు వెళుతున్నట్లయితే, వచ్చే నెలలో అంటే జూన్‌లో మీ నగరంలో ఎన్ని రోజులు బ్యాంకులు మూసివేయబడతాయో ముందుగానే తెలుసుకోవచ్చు.

బ్యాంకులకు 13 రోజులు సెలవులు:

  • 1 జూన్ – ఆదివారం కావడంతో ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  • 6 జూన్ – ఈద్ ఉల్ అధా (బక్రీద్) సందర్భంగా తిరువనంతపురం, కొచ్చిలో బ్యాంకులకు సెలవు.
  • 7 జూన్ – అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గౌహతి, ఏపీ, తెలంగాణ, ఇంఫాల్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొహిమా, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాణా, పాట్, రానాజీ, పాట్, నాగ్‌పూర్‌లలో బక్రీద్ ఈద్ ఉల్ జుహా కారణంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది.
  • 8 జూన్ – ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
  • 10 జూన్ – శ్రీ గురు అర్జున్ దేవ్ జీ బలిదానం దినోత్సవం కారణంగా పంజాబ్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • 11 జూన్ – సంత్ గురు కబీర్ జయంతి కారణంగా గాంగ్టక్, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు.
  • 14 జూన్ – ఈ రోజు నెలలో రెండవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  • 15 జూన్ – ఆదివారం సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  • 22 జూన్ – ఆదివారం సెలవు కారణంగా బ్యాంకులు పనిచేయవు.
  • 27 జూన్ – రథయాత్ర/కాంగ్ రథజాత్ర కారణంగా ఇంఫాల్, భువనేశ్వర్‌లోని బ్యాంకులకు సెలవు.
  • 28 జూన్ – నెలలో నాల్గవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో పని చేయవు.
  • 29 జూన్ – ఈ రోజు ఆదివారం. దీని కారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  • 30 జూన్ – REMRAA అందుబాటులో లేకపోవడం వల్ల ఐజ్వాల్‌లోని బ్యాంకులు పనిచేయవు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us