Honda Electric Bike: హోండా నుంచి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. అద్భుత ఫీచర్లు.. లాంచింగ్ ఎప్పుడంటే..

| Edited By: Anil kumar poka

Jan 03, 2023 | 4:22 PM

ఇదే కోవలో బైక్ తయారీ సంస్థ హోండా ఏకంగా 10 కొత్త ఎలక్ట్రిక్ బైక్లను ఆవిష్కరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా తన మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ EM1 E ని అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే రోజ్ పరేడ్‌లో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Honda Electric Bike: హోండా నుంచి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. అద్భుత ఫీచర్లు.. లాంచింగ్ ఎప్పుడంటే..
Honda Electric Bike (Photo Credit: Honda)
Follow us on

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దిగ్గజ కంపెనీల నడుమ విపరీతమైన పోటీ నడుస్తోంది. మార్కెట్లో వాటికి ఉన్న డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు అన్ని కంపెనీలు తమ వేరియంట్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇదే కోవలో బైక్ తయారీ సంస్థ హోండా ఏకంగా 10 కొత్త ఎలక్ట్రిక్ బైక్లను ఆవిష్కరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా తన మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ EM1 E ని అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే రోజ్ పరేడ్‌లో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన డిజైన్ ఎలిమింట్స్ తో గురించి చిన్న హింట్ ఇస్తూ ఓ స్కెచ్ ను సైతం విడుదల చేసింది. ఇది దాదాపు ఇటీవల ఆ కంపెనీ విడుదల చేసిన సీబీ750 హార్నెట్, సీబీ300 ఎఫ్ ను పోలీ ఉండటంతో కొనుగోలుదారుల్లో ఆసక్తిని పెంచేసింది.

ఫీచర్లు సూపర్..

హోండా విడుదల చేసిన కొత్త మోడల్ ఎలక్ట్రిక్ బైక్ లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది స్ప్లిట్-టైప్ సీటు, ఎల్‌ఈడీ లైటింగ్‌తో కూడిన హెడ్‌లైట్, స్లిమ్ రియర్ ఎండ్ , సొగసైన టెయిల్ ల్యాంప్‌ను ఉంటుంది. బైక్ భద్రతను మెరుగుపరచడానికి డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ తో పాటు బైక్ ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లను అందిస్తోంది. అలాగే రీజెనరేటివ్ బ్రేకింగ్ , రైడింగ్ మోడ్‌లు బైక్ అదనపు ఫీచర్లు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే..

బైక్ స్పెసిఫికేషన్లపై ఆ కంపెనీ ఎటువంటి వివరాలు పొందుపర్చలేదు. దాని బ్యాటరీ బ్యాక్ అప్, మోటార్, రేంజ్ తదితర విషయాలు వెల్లడించలేదు. అయితే ఈ హోండా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 200 కిలోమీటర్ల రేంజ్ లో రావచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇండియాకు ఎప్పుడు వస్తుంది?

హోండా 2025 నాటికి 10 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని యోచిస్తోంది. గత నవంబర్‌లో, కంపెనీ తన ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్ EM1 Eని EICMA 2022లో ప్రదర్శించింది. స్కూటర్ ఫ్లాట్ ఫ్లోర్‌ త పాటు, ముందు ఆప్రాన్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. అయితే ఈ బైక్‌ను భారతదేశంలో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..