AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Activa EV: యాక్టివా నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వచ్చేస్తోంది.. ఏం ఫీచర్స్‌ గురూ అసలు..

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు మార్కెట్లో ఫుల్‌ డిమాండ్‌ ఉంటోంది. ఇందుకు అనుగుణంగానే ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా సైతం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. యాక్టీవా ఈవీ పేరుతో ఈ స్కూటీని లాంచ్‌ చేయనున్నారు. ఇంతకీ స్కూటీ ఎప్పుడు లాంచ్‌ కానుంది.? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి..

Activa EV: యాక్టివా నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వచ్చేస్తోంది.. ఏం ఫీచర్స్‌ గురూ అసలు..
Activa Ev
Narender Vaitla
|

Updated on: Nov 11, 2024 | 7:21 AM

Share

హోండా యాక్టివాకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డుపై నాలుగు స్కూటీలు కనిపిస్తే అందులో కచ్చితంగా రెండు హోండా యాక్టివాలే ఉంటాయనడంలో సందేహం లేదు. కేవలం పెద్ద వారిని మాత్రమే కాకుండా యూత్‌ను కూడా ఈ స్కూటీలు తెగ ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న యాక్టివా ఎలక్ట్రిక్‌ వెర్షన్ లాంచింగ్‌కు రంగం సిద్ధమైంది. నవంబర్‌ నెలలోనే ఈ స్కూటీ మార్కెట్లోకి రానుంది. గత కొన్ని రోజులుగా ఈ స్కూటీకి సంబంధించిన వార్తలు వస్తున్న వేళ తాజాగా ఎట్టకేలకు అధికారిక ప్రకటన చేసేశారు. నవంబర్‌ 27వ తేదీన ఈ స్కూటీని మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. కళ్లు చెదిరే ఫీచర్లతో ఈ స్కూటీని తీసుకొస్తున్నట్లు కంపెనీ ఇది వరకే తెలిపింది.

ఇక ఈ స్కూటర్‌ రేంజ్‌ విషయానికొస్తే ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటీలో స్వాపబుల్‌ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక స్కూటీలో సస్పెన్షన్ కోసం స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్‌ను అందించనున్నారని సమాచారం. ముందు భాగంలో డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేకులు ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే ఈ స్కూటర్‌కు సంబంధించి వచ్చిన ఫొటోలు వెహికిల్‌పై అంచనాలను పెంచేసింది. అయితే జపాన్‌లో లాంచ్‌ అయిన స్కూటీనే భారత్‌లో తీసుకొస్తారా.? ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది చూడాలి. ఇక ఈ స్కూటీలో 7 ఇంచెస్‌ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఎల్ఈడీ లేదా టీఎఫ్టీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఈ స్క్రీన్‌లో రేంజ్‌, మోడ్‌, టైమ్‌, డేట్‌, వెదర్‌, బ్యాటరీ ఇంకెన్ని కిలోమీటర్లు వస్తుంది లాంటి వివరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్