రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిసెంబర్ 7న రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆ తర్వాత చాలా బ్యాంకులు తమ గృహ రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిచ్చాయి. ఈ బ్యాంకులు రెపో రేటుతో అనుసంధానించబడిన గృహ రుణ వడ్డీ రేటును పెంచాయి. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెపో రేట్ లింక్ హోమ్ లోన్ వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ 8.40 శాతం నుండి 8.75 శాతానికి పెరిగింది. ఇందులో రెపో రేటు 6.25 శాతం, మేకప్ 2.50 శాతం ఉన్నాయి. ఈ వడ్డీ కస్టమర్లందరికీ సమాచారం అందించింది బ్యాంకు. డిసెంబర్ 8 నుండి అమలులోకి వస్తుంది. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌తో, బీఎస్‌పీ 25 bps ఛార్జ్ చేయబడుతుంది. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ అంటే రెపో-లింక్డ్ లోన్ వడ్డీ రేటు.
ఇప్పుడు బ్యాంకులో ప్రస్తుతం ఉన్న గృహ రుణంపై ప్రభావవంతమైన వడ్డీ రేటు సంవత్సరానికి 9 శాతంగా ఉంటుంది. ఆర్‌బీఐ డిసెంబర్ పాలసీ రేటు పెంపునకు ముందు పంజాబ్ నేషనల్ బ్యాంక్ గృహ రుణం వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. అయితే మీరు ఇప్పటికే గృహ రుణం తీసుకున్నట్లయితే పాత వడ్డీ వర్తిస్తుంది. దరఖాస్తులో మార్పు వచ్చినా లేదా మళ్లీ రుణం తీసుకున్నా కొత్త వడ్డీ వర్తిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పాటు కెనరా బ్యాంక్ కూడా రెపో రేటు లింక్ వడ్డీ రేటును పెంచింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇప్పుడు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ 8.80 శాతానికి పెరిగింది. ఇది డిసెంబర్ 7 నుండి అమలులోకి వస్తుంది. అంటే ఇప్పుడు బ్యాంకు రుణ వడ్డీపై ఏటా 8.55 శాతం నుంచి 10.80 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి