Home Loan: 20 ఏళ్ల హోమ్ లోన్ 12 ఏళ్లలోనే ఖతం.. లక్షల డబ్బు ఆదా.. ఎలా అంటే..?

మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కట్టుకోవడం ఎంతటి భావోద్వేగమో.. హోమ్ లోన్ తీర్చడం అంతటి సవాలుతో కూడుకున్న పని. చాలామంది ఈఎంఐ కడుతున్నాం కదా అని సరిపెట్టుకుంటారు. కానీ మీరు కట్టే వడ్డీలో ఎంత ఆదా చేయవచ్చో మీకు తెలుసా? కేవలం 5 శాతం అదనపు చెల్లింపుతో మీ లోన్ టైమ్‌ను సగానికి పైగా తగ్గించుకోవచ్చు. బ్యాంకులు మీకు చెప్పని ఈ రహస్యం ఏంటి? అనేది తెలుసుకుందాం..

Home Loan: 20 ఏళ్ల హోమ్ లోన్ 12 ఏళ్లలోనే ఖతం.. లక్షల డబ్బు ఆదా.. ఎలా అంటే..?
Home Loan Repayment Tips

Updated on: Mar 20, 2026 | 12:20 PM

మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ఒక భావోద్వేగం. దీనికోసం బ్యాంకుల నుండి లక్షల రూపాయల అప్పు తీసుకుంటాం. అయితే లోన్ తీసుకునేటప్పుడు మనం కేవలం ఈఎంఐ మాత్రమే చూస్తాం కానీ, 20 ఏళ్లలో మనం అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నామనే నిజాన్ని గమనించం. ఈ చక్రబంధం నుండి బయటపడటానికి ఆర్థిక నిపుణులు రెండు అద్భుతమైన మార్గాలను సూచిస్తున్నారు. కొంచెం తెలివిగా ఆలోచిస్తే.. 20 ఏళ్ల రుణాన్ని కేవలం 12 ఏళ్లలోనే ముగించి, అదనంగా చెల్లించే రూ.30 లక్షల వడ్డీని ఆదా చేయవచ్చు.

ఏడాదికి ఒక అదనపు వాయిదా

సాధారణంగా మనం ఏడాదికి 12 నెలలు.. 12 వాయిదాలు చెల్లిస్తాం. కానీ ఏడాదికి ఒక్క అదనపు వాయిదా చెల్లించి చూడండి. మీరు కట్టే ఈ అదనపు వాయిదా నేరుగా మీ అసలు నుండి తగ్గుతుంది. ఇలా చేయడం ద్వారా 20 ఏళ్ల పాటు కట్టాల్సిన రుణాన్ని కేవలం 15 ఏళ్లలోనే పూర్తి చేయవచ్చు. అంటే 5 ఏళ్ల వాయిదాల భారం మీకు తప్పుతుంది.

వాయిదాను 5 శాతం పెంచండి

మీ కెరీర్ ఎదుగుతున్న కొద్దీ మీ జీతం కూడా పెరుగుతుంది. అదే క్రమంలో మీ హోమ్ లోన్ EMIని కూడా ప్రతి ఏటా కేవలం 5 శాతం పెంచుకుంటూ వెళ్ళండి. మీరు రూ. 50 లక్షల రుణాన్ని 9శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్లకు తీసుకున్నారనుకుందాం. మీరు ప్రతి ఏటా మీ EMIని కేవలం 5శాతం పెంచితే.. ఆ అప్పు 12 ఏళ్లలోనే తీరిపోతుంది. ఈ పద్ధతి ద్వారా మీరు బ్యాంకుకు కట్టాల్సిన దాదాపు రూ.30 లక్షల వడ్డీని ఆదా చేయవచ్చు. ఆ డబ్బుతో మీరు మరో ఆస్తిని కొనుగోలు చేయవచ్చు లేదా మీ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకోవచ్చు.

బ్యాంకుల లాజిక్ ఏంటి?

మనం ఎంత ఎక్కువ కాలం అప్పును ఉంచుకుంటే బ్యాంకులు అంత ఎక్కువ వడ్డీని లాభంగా పొందుతాయి. లోన్ ప్రారంభ సంవత్సరాల్లో మనం కట్టే EMIలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది. అసలు చాలా తక్కువగా తగ్గుతుంది. అందుకే పైన చెప్పిన ప్రీ-పేమెంట్ పద్ధతులు పాటిస్తే వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది.

Follow Us