Business Ideas: ఇంట్లో చిన్న గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో ప్రతీ నెలా రూ. 50 వేలు మీ సొంతం.!

ఉద్యోగంతో విసిగిపోయిన వారికి ఇదొక మంచి ఆప్షన్. తక్కువ పెట్టుబడి.. అధిక రాబడి.. అది కూడా మన ఇంట్లో నుంచే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. అలాగే మార్కెటింగ్ మంచిగా చేస్తే.. దీనికి తిరుగుండదు. మరి ఆ వ్యాపారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Business Ideas: ఇంట్లో చిన్న గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో ప్రతీ నెలా రూ. 50 వేలు మీ సొంతం.!
Money 5

Updated on: Jan 19, 2026 | 9:00 AM

తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే మంచి లాభాలు ఆర్జించే బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. ఆ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందొచ్చు. మరి ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. వివరాల్లోకి వెళ్తే.! ఆ వ్యాపారం మరేదో కాదు బేకరీ బిజినెస్. ఇంట్లోనే బేకరీ వ్యాపారం ప్రారంభించడం అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేందుకు ఒక అద్భుతమైన మార్గం. ఈ బిజినెస్ ఐడియా ముఖ్యంగా భవిష్యత్తులో మంచి రాబడిని అందిస్తుంది. ఇంట్లో తయారుచేసే బేకరీ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

కేక్ తయారీ, డెలివరీ బిజినెస్, కప్ కేకులు, మఫిన్స్ బిజినెస్ లాంటివి స్టార్టప్‌ల మాదిరిగా ప్రారంభించవచ్చు. కస్టమర్ల కోసం ఆరోగ్యకరమైన హెల్తీ మిల్లెట్ బేకరీ ఐటమ్స్, గ్లూటెన్-ఫ్రీ, షుగర్-ఫ్రీ ఐటమ్స్ తయారు చేసి.. వాటిని మంచిగా మార్కెటింగ్ చేస్తే చక్కటి లాభాలు ఆర్జించవచ్చు. కుకీలు, బిస్కెట్లు, బ్రౌనీలు, చాక్లెట్ డెజర్ట్స్, డోనట్స్, పేస్ట్రీ ఐటమ్స్ లాంటివి బెస్ట్ ఆప్షన్లు. పుట్టినరోజులు, పెళ్లిళ్ల లాంటి ప్రత్యేక సందర్భాల కోసం బర్త్ డే, వెడ్డింగ్ కేక్ స్పెషల్స్ అందించడం ద్వారా మరింత మంది కస్టమర్‌లను ఆకర్షించవచ్చు. ఆన్‌లైన్ బేకరీ స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా మన సేల్స్ మరింత మందికి చేరువ అవుతాయి. చిన్న పెట్టుబడితో ఇంట్లోనే ఈ వ్యాపారాలను మొదలుపెట్టి, మంచి లాభాలను ఆర్జించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి