Housing loans: సొంతిల్లు సమకూర్చుకోవడానికి ఇదే సమయం..హోమ్‌లోన్స్‌పై వడ్డీ రేట్ల తగ్గింపు

సొంతిల్లు సమకూర్చుకోవడం మీ కలా, దాన్ని సాకారం చేసుకోవడానికి మంచి సమయం ఎదురుచూస్తున్నారా, అయితే మీ కలను నెరవేర్చుకునే అవకాశం వచ్చేసింది. ప్రస్తుతం హౌసింగ్ రుణాలపై బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాయి. ఇక ఏమాత్రం ఆలస్య చేయకుండా వెంటనే సొంతింటి కల నెరవేర్చుకోవడానికి కార్యాచరణ ప్రారంభించండి. ఇటీవల రిజర్వ్ బ్యాంకు ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. దాన్ని అనుసరించి బ్యాంకుల్లో తీసుకున్న అన్ని రుణాలకు వడ్డీ తగ్గుతుంది. కొత్తగా రుణం తీసుకునే వారితో పాటు ఇప్పటికే రుణం పొందిన వారికి కూడా ఇది వర్తిస్తుంది.

Housing loans: సొంతిల్లు సమకూర్చుకోవడానికి ఇదే సమయం..హోమ్‌లోన్స్‌పై వడ్డీ రేట్ల తగ్గింపు
Home Loan

Updated on: Mar 02, 2025 | 5:45 PM

దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులూ రిజర్వ్ బ్యాంకు ఆదేశాలకు లోబడి పనిచేస్తాయి. అది తీసుకున్ననిర్ణయాలను తూ.చ తప్పకుండా పాటిస్తాయి. ఈ నేపథ్యంలో రెపోరేటును తగ్గించిన కారణంగా అన్ని బ్యాంకులు వెంటనే తమ వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో రుణాలు తీసుకునే వారికి ఎంతో ప్రయోజనం కలగనుంది. అలాగే ఇప్పటికే రుణాలు తీసుకుని ప్రతినెలా వాయిదాలు చెల్లిస్తున్న వారికీ ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా హౌసింగ్ రుణాలపై ప్రతి నెలా కట్టే ఈఎంఐల మొత్తం తగ్గుతుంది. లేకపోతే ఈఎంఐ మొత్తాన్ని అలాగే ఉంచి కాలవ్యవధిని తగ్గిస్తారు.

రెపోరేటు ఆధారిత హౌసింగ్ రుణాన్నే ఫ్లోటింగ్ రుణం అంటారు. దీని వడ్డీ రేటు నేరుగా ఆర్బీఐ రెపోరేటుకు ముడిపడి ఉంటుంది. రెపోరేటు తగ్గితే వడ్డీ తగ్గుతుంది. పెరిగితే వడ్డీ కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రూ.75 లక్షల హౌసింగ్ రుణంపై వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్ బీఐ రెపోరేటును తగ్గించిన తర్వాత 2025 ఫిబ్రవరి 26 నాటికి ఈ రేట్లు అమలవుతున్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీరేట్లు

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 8.25 నుంచి 9.40, బ్యాంకు ఆఫ్ బరోడాలో 8.40 నుంచి 10.65, యూనియన్ బ్యాంకులో 8.10 నుంచి 10.65, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 8.15 నుంచి 9.90, బ్యాంకు ఆఫ్ ఇండియాలో 8.30 నుంచి 10.85, కెనరా బ్యాంకులో 8.15 నుంచి 10.90, యూకో బ్యాంకులో 8.30 నుంచి, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో 8.10 నుంచి 10.90, పంజాబ్, సింధ్ బ్యాంకులో 8.35 నుంచి 9.85, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 8.15 నుంచి 10.75, ఇండియన్ బ్యాంకులో 8.15 నుంచి 9.55 శాతం వడ్డీని హౌసింగ్ రుణాలపై వసూలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రైవేటు రంగ బ్యాంకుల్లో వడ్డీరేట్లు

కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకులు 8.75, హెచ్ఎస్బీసీ, సౌత్ ఇండియన్ బ్యాంకులు 8.50, ఫెడరల్ బ్యాంకు 8.55, ధనలక్ష్మి బ్యాంకు 8.75, హెచ్ డీఎఫ్సీ బ్యాంకు లిమిటెడ్ 8.70, ఆర్ బీఎల్ బ్యాంకు 9 శాతం నుంచి వడ్డీ రేట్లు విధిస్తున్నాయి. కరూర్ వైశ్యా బ్యాంకులో 8.75 నుంచి 11.70, యాక్సిస్ బ్యాంకులో 8.75 నుంచి 9.65, కర్ణాటక బ్యాంకులో 8.79 నుంచి 9.44, తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో 8.60 నుంచి 9.95 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు.

మరిన్ని  బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి