AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score Tips: మీ క్రెడిట్‌ స్కోర్ పెంచుకునేందుకు అద్భుతమైన ట్రిక్స్‌

Credit Score Tips: బ్యాంకు రుణాలు తీసుకోవాలంటే ముందుగా క్రెడిట్‌ స్కోర్‌ చాలా ముఖ్యం. ఇది ఉంటేనే రుణాలు అందుతాయి. లేకుంటే అంతే సంగతి. బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు ఈ క్రెడిట్‌ స్కోర్‌ను చూస్తాయి. స్కోర్‌ లేకుంటే రుణాలు అందవని గుర్తించుకోండి. బ్యాంకు నుంచి గానీ ఇతర ప్రైవేట్‌ సంస్థల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని పక్షంలో క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోతుంటుంది..

Credit Score Tips: మీ క్రెడిట్‌ స్కోర్ పెంచుకునేందుకు అద్భుతమైన ట్రిక్స్‌
Subhash Goud
|

Updated on: Mar 02, 2025 | 5:26 PM

Share

ప్రతి వ్యక్తికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. మీకు మంచి స్కోర్ ఉంటే, మీకు సులభంగా రుణం లభిస్తుంది. మీకు అత్యవసరంగా పర్సనల్ లోన్ అవసరమైతే క్రెడిట్ స్కోర్ ఉపయోగపడుతుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీ రేట్లకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. కెరీర్‌ను ప్రారంభించే యువకులు క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఇప్పుడు రుణం అవసరం లేకపోయినా, భవిష్యత్తులో క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండటం ముఖ్యం. ఈ నేపథ్యంలో క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడానికి కొన్ని ట్రిక్స్‌ పాటిస్తే స్కోర్‌ను మరింతగా మెరుగు పర్చుకోవచ్చుంటున్నారు నిపుణులు.

క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?

మీరు రుణ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు ఎలా చేస్తున్నారు? అనే దాని ఆధారంగా ఏజెన్సీలు క్రెడిట్ స్కోర్‌ను ఇస్తాయి. స్కోరు 300 నుండి 850 పాయింట్ల వరకు ఉంటుంది. 650 కంటే ఎక్కువ స్కోరు మంచిగా పరిగణిస్తారు. ఎప్పుడూ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించని వారికి క్రెడిట్ స్కోర్ ఉండదు. వారి CIBIL స్కోర్‌ను మైనస్ 1గా చూపవచ్చు. అటువంటి వ్యక్తుల కోసం క్రెడిట్ స్కోర్ ఎలా పొందాలనే దానిపై ఇక్కడ చిట్కాలు ఉన్నాయి.

చిన్న రుణాలు చేయండి

క్రెడిట్ స్కోర్ పొందడానికి మీరు రుణాన్ని చెల్లించాలి. చిన్నపాటి రుణం తీసుకుని సకాలంలో చెల్లించండి. ఉదాహరణకు, రూ. 50,000 రుణం తీసుకుని నెలవారీ EMIని తప్పకుండా చెల్లించండి. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. అది ముగిసిన తర్వాత, మీరు మళ్లీ చిన్న కొత్త రుణం తీసుకోవచ్చు. ఇవన్నీ క్రెడిట్ స్కోర్‌ను పెంచడంలో సహాయపడతాయి.

క్రెడిట్ కార్డ్:

మీరు క్రెడిట్ కార్డును పొందండి. దానిని పొదుపుగా ఉపయోగించండి. దాని బిల్లును సకాలంలో చెల్లించడం మర్చిపోవద్దు. మీ కార్డ్ క్రెడిట్ పరిమితిలో 40 శాతం కంటే తక్కువ మాత్రమే ఖర్చు చేయండి. మీరు ఎక్కువ షాపింగ్ చేయాలనుకుంటే మరొక కార్డు పొందండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్