భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యమ్నాంగా అందరూ ఈవీ వాహనాలను ఇష్టపడుతున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి పర్యావరణాన్ని రక్షించడానికి ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈవీ స్కూటర్లపై ప్రత్యేక రాయితీలనిస్తూ ఈవీ కొనుగోలును ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. అయితే పెరిగిన డిమాండ్ మేరకు ఈవీ కంపెనీలన్నీ కొత్త మోడల్ స్కూటర్స్‌తో మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ పెట్రోల్ స్కూటర్ల మార్కెట్స్‌లో రారాజుగా ఉన్న కంపెనీలు ఈవీ వాహనాలను తయారు చేస్తున్నాయి. పైగా వాటిపై ప్రత్యేకంగా పండుగ ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. తాజా హీరో మోటోకార్ప్ కంపెనీ తన ఈవీ స్కూటరైన విడా వీ1పై ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా ఈ స్కూటర్‌పై ఏకరంగా రూ.31 వేల తగ్గింపును అందిస్తుంది. కాబట్టి ఈ స్కూటర్ ఫీచర్లతో పాటు తగ్గింపు వివరాలపై ఓ లుక్కేద్దాం.
హీరో విడా వీ1 స్కూటర్ తగ్గింపుల విషయానికి వస్తే తగ్గింపుల్లో నగదుతో పాటు లాయల్టీ తగ్గింపులు, ఎక్స్చేంజ్ బోనస్, పొడగించిన బ్యాటరీ వారెంటీ అన్ని తగ్గింపులతో కలిపి వస్తాయి. ఈ ఆఫర్లు మాత్రం ఈ నెలాఖరుకు వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇయర్ ఎండ్ ఆఫర్స్‌లో భాగంగా విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.8259 విలువైన ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారెంటీని అందిస్తుంది. అలాగే బ్యాటరీ విలువపై రూ.5 వేల తగ్గింపునిస్తుంది. అలాగే రూ. 5 వేల నుంచి రూ.7 వేలు లాయల్టీ తగ్గింపులతో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. అలాగే రూ.2500 కార్పొరేట్ తగ్గింపులు కూడా ఈ స్కూటర్‌పై పొందవచ్చు. రూ.1125 విలువైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఈ స్కూటర్ తగ్గింపుల్లో అందుబాటులో ఉంది. కస్టమర్లు తమ విడా వి1 స్కూటర్‌పై 5.99 శాతం తక్కువ వడ్డీ రేటుతో ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌ను కూడా పొందవచ్చు. అలాగే జీరో ప్రాసెసింగ్ ఫీచర్లు ఈఎంఐలు కూడా అందుబాటులో ఉన్నాయి.
హీరో విడా వి1 స్కూటర్ ధర విషయానికి వస్తే హీరో విడా వి1 స్కూటర్ ధర రూ.1.26 లక్షలు, హీరో విడా వి1 ప్రో స్కూటర్ ధర రూ.1.46 లక్షలుగా ఉంటుంది. ఈ స్కూటర్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 110 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. హీరో విడా వి1 స్కూటర్ 3.1 సెకన్స్‌లో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. డీసీ చార్జర్‌ను ఉపయోగించి 65 నిమిషాల్లో 0-80 శాతం చార్జ్ అయ్యే రిమూవల్ బ్యాటరీతో వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..