Investment: దీపావళికి బోనస్ వచ్చిందా.? ఇలా తెలివిగా ఉపయోగించుకోండి..
అయితే ఇలా వచ్చిన బోనస్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక కొందరు తప్పులు చేస్తుంటారు. పండక్కి వచ్చే బోనస్ డబ్బులను తెలివిగా ఉపయోగించుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పండక్కి వచ్చిన బోనస్‌ను పండక్కే ఖర్చు చేస్తుంటారు. షాపింగ్ పేరుతో కొత్త దుస్తులు కొనుగోలు చేస్తుంటారు. అయితే బోనస్‌గా వచ్చిన మొత్తాన్ని పెట్టుబడిగా మార్చుకోవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ...
దీపావళి బోనస్ చాలా కంపెనీలు ఇస్తుంటాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పండక్కి బోనస్ ఇవ్వడం సర్వ సాధారణమైన విషయం. కొన్ని సంస్థలు ఉద్యోగులకు వస్తువుల రూపంలో బహుమతులు ఇస్తే, మరికొన్ని సంస్థలు ఒకటి లేదా రెండు నెలల జీతాన్ని బోనస్‌గా అందిస్తుంటాయి.
అయితే ఇలా వచ్చిన బోనస్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక కొందరు తప్పులు చేస్తుంటారు. పండక్కి వచ్చే బోనస్ డబ్బులను తెలివిగా ఉపయోగించుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పండక్కి వచ్చిన బోనస్‌ను పండక్కే ఖర్చు చేస్తుంటారు. షాపింగ్ పేరుతో కొత్త దుస్తులు కొనుగోలు చేస్తుంటారు. అయితే బోనస్‌గా వచ్చిన మొత్తాన్ని పెట్టుబడిగా మార్చుకోవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ బోనస్ డబ్బులను ఎక్కడ పెట్టుబడి పెట్టాలి.? ఎక్కడ పెడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
* మీరు ఒకవేల అప్పటికే ఏదైనా లోన్‌ను తీసుకొని ఉంటే వచ్చిన బోనస్‌తో లోన్‌లో కొంత మొత్తాన్ని ముందస్తు చెల్లింపులకు ఉపయోగించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మీ లోన్ మొత్తం తగ్గడం పోటు ఈఎమ్‌ఐ భారం కూడా తగ్గుతుంది. అలాగే వడ్డీ రేటు తగ్గుతుంది.
* మీకు పెద్ద మొత్తంలో బోనస్ అందితే మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు ఎఫ్‌డీలపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నారు. కాబట్టి బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేస్తే అటు సెక్యురిటీతో పాటు ఇటు మంచి వడ్డీని పొందొచ్చు.
* ఇక బోనస్‌గా వచ్చిన మొత్తాన్ని వెంటనే ఉపయోగించకుండా ఎమర్జన్సీ ఫండ్‌గా కూడా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం వంటి అత్యవసర సమయాల్లో డబ్బుల కోసం వెతుక్కోకుండా ఉండేందుకు ఈ ఫండ్ ఉపపయోగపడుతుంది. ఈ మొత్తాన్ని బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్‌లో సేవ్ చేసి పెట్టుకుంటే సమయానికి ఉపయోగించుకోవచ్చు.
* ఇక బోనస్‌ను బంగారంలో పెట్టుబడిగా పెట్టడం కూడా ఒక మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. పెరగడమే తప్ప తగ్గడం లేదనేలా ఉంటుంది బంగారం పరిస్థితి. కాబట్టి బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదు. ప్రతీ ఏట వచ్చిన బోనస్‌తో ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తూ వెళ్తుంటే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది.
* ఇక మీరు ఒకవేళ హోమ్‌లోన్ లేదా మరే లోన్ కోసమైనే ప్రయత్నిస్తుంటే దీపావళికి వచ్చిన బోనస్‌ను డౌన్‌పేమెంట్‌గా ఉపయోగించుకుంటే మంచి బెనిఫిట్స్ పొందొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. చూశారుగా ఈ పండక్కి మీక్కూడా బోనస్ వస్తే తొందరపాటుతో ఖర్చు చేయకుండా ఇలా తెలివిగా ఇన్వెస్ట్ చేయండి, మంచి లాభాలను పొందండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..