SIP: ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు! అదెలా అంటే..
భవిష్యత్తులో ద్రవ్యోల్బణాన్ని కూడా అధిగమించేలా మీ పెట్టుబడి ఎంపిక ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే 5, 10 ఏళ్లలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా రాబడి ఉండే పెట్టుబడి ప్రారంభించాలని చెబుతున్నారు. అందుకు బెస్ట్ ఆప్షన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అని నిపుణులు వివరిస్తున్నారు. సంప్రదాయ పొదుపు పథకాలు ఈ ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేవు.
సంప్రదాయ పెట్టుబడి పథకాలు అంటే బ్యాంకులు, పోస్టాఫీసుల్లోని పథకాలు ఎప్పుడూ సురక్షితం. ఎందుకంటే వాటిల్లో రిస్క్ ఉండదు. నిర్ధేశిత సమయంలో కచ్చితమైన రాబడిని అందిస్తాయి. అందుకే వాటిల్లో అధికంగా పెట్టుబడులు పెట్టేందుకు అందరూ మొగ్గుచూపుతారు. అయితే నిత్యం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మీ పొదుపు, పెట్టుబడి ప్రణాళిక లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. అంటే భవిష్యత్తులో ద్రవ్యోల్బణాన్ని కూడా అధిగమించేలా మీ పెట్టుబడి ఎంపిక ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే 5, 10 ఏళ్లలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా రాబడి ఉండే పెట్టుబడి ప్రారంభించాలని చెబుతున్నారు. అందుకు బెస్ట్ ఆప్షన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అని నిపుణులు వివరిస్తున్నారు. సంప్రదాయ పొదుపు పథకాలు ఈ ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేవు. అదే మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఉన్నా.. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి అధిక రాబడిని అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
మ్యూచువల్ ఫండ్స్..
మ్యూచువల్ ఫండ్స్ అధిక రాబడులను అందించే బెస్ట్ పెట్టుబడి పథకం. ఇందులో అనేక రకాలు అందుబాటులో ఉంటాయి. కాంపౌండింగ్ సూత్రం ద్వారా మీ పెట్టుబడిని చాలా తక్కువ సమయంలోనే భారీగా పెంచేస్తుంది. అయితే ఇది మార్కెట్లోని స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ఎంతమేర లాభం వస్తుందో.. అంతే స్థాయిలో ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్ లోని సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్(ఎస్ఐపీ)లో ఆ రిస్క్ శాతం కొంతమేర తక్కువగా ఉండటంతో పాటు దీనిలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెల దీనిలో కొద్ది మొత్తంలో కనీసం రూ. 500 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఈ నేపథ్యంలో ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పదేళ్లలోపే కోటీశ్వరులు కావడం ఖాయం. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
పదేళ్లలో కోటీశ్వరులు ఎలా?
ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లో మీరు మీరు ప్రతి నెల కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అది అతి తక్కువ సమయంలోనే మంచి రాబడిని ఇస్తుంది. మీరు నెలకు రూ. 30వేల చొప్పున ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. అలా ఏడాది పాటు కొనసాగించాలి. రెండో ఏడాది ఓ పది శాతం అదనంగా దానికి జోడించి పెట్టుబడి పెట్టాలి. అలా ఏటా 10శాతం పెంచుకుంటూ వెళ్లాలి. అప్పుడు మీకు సగటున వార్షిక రాబడి 12శాతం వస్తుందని అంచనా వేసుకుంటే ఏడేళ్లలో మీ చేతిలో రూ. 50లక్షలు వచ్చి చేరతాయి. ఆ మొత్తాన్ని విత్ డ్రా చేయకుండా అలాగే కొనసాగిస్తే.. మరో మూడున్నరేళ్ల పాటు కొనసాగిస్తే దానికి మరో రూ. 50లక్షలు యాడ్ అవుతాయి. మొదటి రూ. 50లక్షలకు ఏడేళ్లు పడితే.. తర్వాత రూ. 50లక్షలకు మూడేళ్లే పడుతుంది. అది కాంపౌండింగ్ లోని మ్యాజిక్. ఆ మొత్తాన్ని అంటే రూ. కోటికి అదనంగా అలాగే పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తే మరో మూడేళ్లలో ఇంకో రూ. 50లక్షలు యాడ్ అవుతాయి. అంటే పదేళ్ల కాలంలోనే మీకు రూ. కోటిన్నర సమకూరినట్లు అవుతుంది. ఇలా రూ. 30వేల చొప్పున ఏటా 10శాతం పెంచుకుంటూ 19 ఏళ్ల పాటు కొనసాగిస్తే మీకు అక్షరాల రూ. కోట్లు అందుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..