సంప్రదాయ పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోడానికి ఇష్టపడరు. కచ్చితమైన రాబడి కావాలని కోరుకుంటారు. స్థిరమైన వడ్డీ ఉండాలనుకుంటారు. అటువంటి వారు ఎక్కువగా పోస్ట్ ఆఫీసుల్లోని పెట్టుబడి పథకాలలో ఇన్వెస్ట్ చేస్తారు. పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే చిన్న మొత్తాల పొదుపు పథకాలు వీరికి బాగా ఉపకరిస్తున్నాయి. వీటిల్లో మంచి వడ్డీ రేటు ఉండటంతో పాటు ఎలాంటి రిస్క్ ఉండదు. కేంద్ర ప్రభుత్వ భరోసా కూడా ఉండటంతో తమ సొమ్మును భద్రంగా భావిస్తారు. పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, టైమ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, కిసాన్ వికాస పత్ర వంటి పథకాలు ఉంటాయి. వీటిల్లో సుకన్య సమృద్ది యోజనతోపాటు మూడేళ్ల టైం డిపాజిట్ పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ కూడా పెంచింది. ఈ త్రైమాసికానికి 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ వడ్డీ రేట్లు జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి 31 వరకూ కొనసాగుతాయి. కాగా మిగిలిని పథకాల్లో వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ క్రమంలో ఆయా పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది. దేనిలో ఎంత వడ్డీ ఉంటుంది? ఎంత రాబడి వస్తుంది. తెలుసుకుందాం..
ఆడ పిల్లల కోసం ప్రత్యేకించిన స్కీమ్ ఇది. పదేళ్లలోపు ఉన్న బాలికల కోసం వారి తల్లిదండ్రులు ఈ ఖాతా ప్రారంభించాల్సి ఉంది. గతంలో దీనిలో వడ్డీ రేటు 8శాతం ఉండగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటు పెంచడంతో ప్రస్తుతం 8.2శాతం వరకూ వడ్డీ రేటు ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోస్టాఫీసు పథకాల్లో దీనిలోనే అత్యధిక వడ్డీ రేటు ఉంటుంది. దీనిలో ప్రతి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, వార్థిక ప్రాతిపదికన డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం మీ పాప వయసు ఐదేళ్లు అనుకుంటే.. ఇప్పుడు(2024లో) ఈ ఖాతాలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. ఏడాదికి రూ. లక్ష చొప్పున పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ 21 ఏళ్లకు అవుతుంది. అంటే 2024 నాటికి అసలు, వడ్డీ మొత్తం కలిపి రూ. 46.18లక్షలు అవుతుంది.
ఈ పథకంపై కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల వడ్డీ పెంచింది. దీంతో వడ్డీ రేటు 7.1శాతానికి చేరింది. ఈ క్రమంలో దీనిలో రూ. లక్ష పెట్టుబడి పెడితే ఏడాదికి రూ. 7,100 వడ్డీ రూపంలో వస్తుంది. మూడేళ్ల మెచ్యూరిటీ తర్వాత రూ. 23,500 వడ్డీ వస్తుంది.
దీనిలో వడ్డీ రేటు 7.5శాతంగా ఉంది. ఏడాది దీనిలో రూ. లక్ష పెట్టుబడి పెడితే ఒక సంవత్సరానికి రూ. 7,500 వడ్డీ వస్తుంది. అదే ఐదేళ్లకు వడ్డీ రూ. 45వేల వడ్డీ వస్తోంది.
ఈ స్కీమ్లో వడ్డీ రేటు 7.5శాతంగా ఉంది. ఐదేళ్ల కాలపరిమితితో ఉండే ఈ పథకంలో మీకు వడ్డీ రేటు 6.7శాతంగా ఉంటుంది. ఇందులో మీరు పెట్టే పెట్టుబడిని బట్టి ఆదాయం సమకూరుతుంది.
ఇది వృద్ధులకు బాగా ఉపకరిస్తుంది. దీనిలో వడ్డీ రేటు 8.2శాతంగా ఉంటుంది. దీనిలో ఏడాదికి రూ. లక్ష డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు రూ. 8,200గా ఉంటుంది. కాంపౌండ్ ఇంటరెస్ట్ కాబట్టి అధిక రాబడిని అందుకోవచ్చు.
మంత్లీ ఇన్ కమ్ ఖాతా.. ఈ పథకంలో కూడా మంచి వడ్డ రేటు లభిస్తోంది. ప్రస్తుతం 7.4శాతంగా ఉంది. దీనిలో రూ. లక్ష పెట్టుబడి పెడితే వడ్డీ మొత్తం ఏడాదికి రూ. 7,400వస్తుంది. నెలావారీ వడ్డీ ఖాతాలో జమవుతుంది.
ఈ పథకంలో వడ్డీ రేటు 7.1శాతంగా ఉంది. దీనిలో ఏడాదికి ఒక లక్ష రూపాయాలు పెట్టుబడి పెడితే వడ్డీ మొత్తం రూ. 7,100 వస్తుంది.
రిటైర్ మెంట్ ప్లానింగ్ చేసుకునే వారికి ఈ పథకం సరిగ్గా సరిపోతుంది. దీనిలో వడ్డీ రేటు 7.7శాతంగా ఉంది. మెచ్యూరిటీ కనీసం ఐదేళ్లు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత మొత్తం వడ్డీనే రూ. 46,400 వరకూ పొందొచ్చు.
ఈ పథకంలో వడ్డీ రేటు 7.5శాతంగా ఉంటుంది. ఇది 115 నెలల కాలవ్యవధితో వస్తుంది. ఒక లక్ష పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ పూర్తయ్యే సమయానికి వడ్డీ రేటు రూ. 1.1 లక్షలు అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..