
ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడి పథకాలు. దీనిలో అధిక వడ్డీతో పాటు కచ్చితమైన రాబడి వస్తుంది. ఇక సీనియర్ సిటిజెన్స్, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు అయితే మరింత అధిక వడ్డీని బ్యాంకులు అందజేస్తుంటాయి. వయసు 60 దాటిన వ్యక్తులకు ఇచ్చే వడ్డీ బ్యాంకును బట్టి మారుతుంటుంది. సాధారణ పౌరులతో పోల్చితే కనీసం 0.50శాతం అదనంగా వీరికి వడ్డీని అందజేస్తారు. పెద్ద వయసు వారికి అధిక ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. అయితే ఫిబ్రవరీ మూడో తేదీన పలు బ్యాంకులు తమ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. వాటిల్లో సీనియర్ సిటిజెన్స్ కు అధిక వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం..
చిన్న ఫైనాన్స్ బ్యాంకులు సాధారణంగా పెద్ద బ్యాంకుల కంటే ఎక్కువ రేట్లను అందిస్తాయి. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో, సీనియర్ సిటిజన్లు 1,001 రోజుల ఎఫ్‌డీపై 9.50 శాతం వరకు వడ్డీని పొందవచ్చు. ఈ బ్యాంక్ 2024, ఫిబ్రవరి 2న రేట్లను సవరించింది. ఇది సీనియర్ సిటిజన్‌లకు ఆరు నెలల నుంచి 201 రోజుల ఎఫ్‌డీపై 9.25 శాతం వడ్డీ అందిస్తుంది. 501 రోజుల ఎఫ్‌డీపై వృద్ధులకు 9.25 శాతం అందిస్తుంది. 701 రోజులకు 9.45 శాతం వడ్డీని అందిస్తుంది.
ఈ బ్యాంక్ ఫిబ్రవరి 1న వడ్డీ రేట్లను సవరించింది. 444 రోజుల ఎఫ్‌డీపై ఈ బ్యాంక్ 8.10 శాతం ఆఫర్ చేస్తోంది. ఈ ప్రత్యేక ఎఫ్‌డీ ప్రారంభించడానికి గడువు మార్చి 31, 2024 వరకూ ఉంది.
2024, ఫిబ్రవరి నుండి, కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) సీనియర్ సిటిజన్‌లకు తన 444 రోజుల ఎఫ్డీపై అత్యధికంగా 8.00 శాతం వడ్డీని అందిస్తుంది.
సీనియర్ సిటిజన్లు 400 రోజుల ఎఫ్డీలపై గరిష్టంగా 7.75 శాతం వడ్డీని పొందవచ్చు. బ్యాంక్ ఫిబ్రవరి 1, 2024న రేట్లను సవరించింది. పీఎన్జీ సాధారణ, సీనియర్ సిటిజన్‌లతో పాటు సూపర్ సీనియర్‌లకు 300 రోజుల డిపాజిట్లపై 80 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ డిపాజిట్లు సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం రాబడికి హామీ ఇస్తాయి.
సాధారణంగా ఫిక్స్ డ్ డిపాజిట్లు కచ్చితమైన రాబడిని ఇస్తాయి. వడ్డీ కూడా ముందుగానే తెలుస్తుంది కాబట్టి.. ఎంత కాలానికి ఎంత మొత్తం వస్తుందో కూడా ముందుగానే అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకు ఇది అధిక ప్రయోజనాన్ని ఇస్తుంది. వీరికి వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎఫ్డీ ప్రారంభించే ముందు ఎక్కడ వడ్డీ రేటు ఎక్కువ ఉంది. ఇతర ప్రయోజనాలు ఏమున్నాయి అనేది బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..