
సాధారణంగా మనందరికీ ఎక్కువగా తెలిసిన పొదుపు మార్గం ఫిక్స్ డ్ డిపాజిట్లు. వీటిలో సొమ్మును డిపాజిట్ (ఎఫ్ డీ) చేయడం ద్వారా నిర్ణీత కాలానికి వడ్డీతో కలిసి కొంత మొత్తం అందుతుంది. అయితే ఎఫ్ డీలపై అన్ని బ్యాంకులు ఒకే వడ్డీరేటు ఇవ్వవు. అందువల్లనే సురక్షితమైన బ్యాంకుతో పాటు, అధిక వడ్డీరేటు ఇచ్చే బ్యాంకులను ఎంచుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్ల లోని బ్యాంకులన్నీ ప్రజల నుంచి ఎఫ్ డీలను ఆహ్వానిస్తాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అతి పెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఎఫ్ డీ పథకాలు, వాటికి ఇస్తున్న వడ్డీరేట్లను తెలుసుకుందాం..
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) నూతన ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకాన్ని ప్రారంభించింది. దాని పేరు అమృత్ కలాష్ స్పెషల్ ఎఫ్‌డీ. ఇందులో వేసిన డిపాజిట్లకు సాధారణ ఎఫ్‌డీలకు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువ వస్తుంది. సీనియర్ సిటిజన్లకు మంచి అవకాశం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టుబడి పెట్టడానికి ప్రజలను ఆహ్వానిస్తోంది. ఈ గడువును అనేక సార్లు పొడిగించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం మార్చి 31 వరకూ అవకాశం ఉంది. ఎస్ బీఐ ప్రవేశపెట్టిన ఈ పథకం సీనియర్ సిటీజన్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ ఎఫ్ డీలపై వడ్డీ కంటే ఎక్కువగా ఇవ్వడం వీరికి ప్రయోజనం కలిగిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఈనెలాఖరు వరకూ మాత్రమే గడువు ఉంది. సమీపంలోని ఆ బ్యాంకు శాఖలను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
వడ్డీ రేటు ఇలా.. అమృత్ కలాష్ ఎఫ్ డీ పథకంలో డిపాజిట్లకు వఢ్డీ రేటు అధికంగానే ఉంది. 400 రోజుల కాలవ్యవధికి చేసిన డిపాజిట్లపై సుమారు 7.10 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ వడ్డీ రేటు ఎస్ బీఐ సాధారణ ఎఫ్ డీ రేటు కంటే ఎక్కువ. సీనియర్ సిటిజన్లు సంవత్సరానికి 7.60 శాతం వడ్డీని పొందుతారు. ఈ పథకంలో సీనియర్ సిటిజన్ల తో పాటు మామూలు ఖాతాదారులు కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
అమృత్ కలాష్ ఎఫ్ డీతో పాటు మరికొన్ని ఇతర పథకాలను కూడా ఎస్ బీఐ అమలు చేస్తుంది. అవి కూడా ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
గ్రీన్ డిపాజిట్.. ఎస్ బీఐ గ్రీన్ డిపాజిట్ పథకం కూడా ఖాతాదారులకు అందుబాటులో ఉంది. ఇందులో పెట్టుబడిదారులు 1,111 రోజులు, 1,777 రోజులు, 2,222 రోజుల సౌకర్యవంతమైన కాలపరిమితిని ఎంచుకోవచ్చు. ఈ పథకం బ్రాంచ్ నెట్‌వర్క్ ద్వారా అందుబాటులో ఉంది. ఇది త్వరలో యోనో మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు (ఐఎన్ బీ) వంటి ఇతర డిజిటల్ ఛానెళ్ల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎస్బీఐ బెస్ట్.. ఈ డిపాజిట్ పథకం సాధారణ ఎఫ్ డీ కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇది రెండేళ్ల కాలపరిమితికి వేసిన డిపాజిట్లపై 7.4 శాతం, ఒక ఏడాది వ్యవధికి వేసిన డిపాజిట్లపై 7.10% రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ రేట్లపై అదనంగా మరి కొంత శాతం వడ్డీని పొందుతారు.
ఎస్బీఐ వీ కేర్.. సీనియర్ సిటిజన్ల కోసం 2020లో ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. దీనిలో జమ చేసిన ఎఫ్ డీలకు మరింత మెరుగైన వడ్డీ అందిస్తారు. సాధారణ కార్డ్ రేటుపై 0.5 శాతం అదనపు వడ్డీ చెల్లిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..