Best BLDC Fans: ఈ సీలింగ్ ఫ్యాన్లతో భారీగా విద్యుత్ ఆదా.. రిమోట్ కంట్రోల్‌తో నియంత్రణ..

సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో బీఎల్డీసీ(బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్) సీలింగ్ ఫ్యాన్లు వచ్చాయి. ఇవి మెరుగైన గాలి ప్రవాహాన్ని అందించడంతో పాటు తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి. అందుకు గానూ అధునాతన మోటార్ టెక్నాలజీని ఈ సీలింగ్ ఫ్యాన్లలో వినియోగించారు. ఈ ఫ్యాన్లు ఎకో-కాన్షియస్ డిజైన్‌ తో వస్తాయి. సాటిలేని పనితీరు కోసం బహుళ ఫీచర్లను కలిగి ఉంటాయి.

Best BLDC Fans: ఈ సీలింగ్ ఫ్యాన్లతో భారీగా విద్యుత్ ఆదా.. రిమోట్ కంట్రోల్‌తో నియంత్రణ..
Atomberg Bldc Fan
Follow us

|

Updated on: May 16, 2024 | 4:16 PM

కాలం ఏదైనా మనకు ఫ్యాన్ తప్పనిసరి. ప్రతి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ అనేది చాలా అవసరమైన వస్తువు. అది లేకుండా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేం. ఇంట్లోకి రాగానే ఫ్యాన్లు ఆన్ చేస్తాం. అయితే మనం వాడుతున్న ఫ్యాన్లు నాణ్యమైనవేనా? మంచిగా గాలి ప్రసరణను అందిస్తుందా? కరెంటు బిల్లును తగ్గిస్తుందా? అనే అంశాలు చాలా కీలకం. ఈ ప్రయోజనాల కోసం సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో బీఎల్డీసీ(బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్) సీలింగ్ ఫ్యాన్లు వచ్చాయి. ఇవి మెరుగైన గాలి ప్రవాహాన్ని అందించడంతో పాటు తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి. అందుకు గానూ అధునాతన మోటార్ టెక్నాలజీని ఈ సీలింగ్ ఫ్యాన్లలో వినియోగించారు. ఈ ఫ్యాన్లు ఎకో-కాన్షియస్ డిజైన్‌ తో వస్తాయి. సాటిలేని పనితీరు కోసం బహుళ ఫీచర్లను కలిగి ఉంటాయి. అంతేకా నిశ్శబ్ద ఆపరేషన్‌ను అందిస్తాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లోని బెస్ట్ బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్లను మీకు పరిచయం చేస్తున్నాం..

ఆటమ్ బర్గ్ రెనేసా 1200ఎంఎం బీఎల్డీసీ మోటార్ సీలింగ్ ఫ్యాన్లు..

ఈ సీలింగ్ ఫ్యాన్ కు 5 స్టార్ రేటింగ్ ఉంది. దీనిని రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేయొచ్చు. ఇది డౌన్ రాడ్ మౌంట్, అల్యూమినియం బాడీని కలిగి ఉంటుంది. ఇది కేవలం 28వాట్ల విద్యుత్ ను మాత్రమే వినియోగిస్తుంది. దీనిలో బూస్ట్ మోడ్, టైమర్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి. దీనిని సులభంగా నియంత్రించేందుకు ఐఆర్ రిమోట్ ఉంటుంది. ఎల్ఈడీ లైట్లతో కూడిన సొగసైన డిజైన్ ను కలిగి ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ. 3,699గా ఉంది.

యాక్టివా గ్రేషియా 1200ఎంఎం బీఎల్డీసీ మోటార్ ఫ్యాన్..

ఈ సీలింగ్ ఫ్యాన్ ఎల్ఈడీ లైట్, రిమోట్ కంట్రోల్ తో వస్తుంది. ఇది సూపర్ ఎనర్జీ ఎఫెక్టివ్ బీఎల్డీసీ మోటార్ ను కలిగి ఉంటుంది. 28వాట్ల విద్యుత్ ను వినియోగిస్తుంది. 6-స్పీడ్ కంట్రోల్, బూస్టర్ మోడ్ ఉంటుంది. దీని డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ. 2,499కే అందుబాటులో ఉంటుంది.

హావెల్స్ 1200ఎంఎం ఎలియో బీఎల్డీసీ మోటార్ సీలింగ్ ఫ్యాన్..

ఈ ఫ్యాన్ అధిక సామర్థ్యంతో మంచి పనితీరును అందిస్తుంది. ఇది స్టైలిష్ గ్రే ఫినిషింగ్ తో వస్తుంది. గరిష్టంగా 60శాతం విద్యుత్ ఆదాతో 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది. రిమోట్ కంట్రోల్ తో సౌకర్యవంతమైన ఆపరేషన్ ను అందిస్తుంది. దీని ధర దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ. 3,999గా ఉంటుంది.

ఓరియంట్ ఎలక్ట్రిక్ జెనో 1200ఎంఎం బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్..

ఇది బీఈఈ 5స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఇది 50శాతం విద్యుత్ ను మాత్రమే వినియోగిస్తుంది. ఇది ఏడాదికి రూ. 6500 వరకూ విద్యుత్ వరకూ ఆదా చేస్తుంది. ఇది సులభంగా స్మార్ట్ రిమోట్ వస్తుంది. దీని సాయంతో వేగాన్ని సర్దుబాటు చేయొచ్చు. బూస్ట్ మోడ్ సెట్ చేయొచ్చు. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ. 2949గా ఉంటుంది.

పాలీ క్యాబ్ సిలెన్షియో మినీ 1200ఎంఎం బీఎల్డీసీ ఫ్యాన్..

ఈ సీలింగ్ ఫ్యాన్ 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది. బూస్ట్ ప్లస్ ప్లస్ టెక్నాలజీతో వస్తుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా పనిచేసేందుకు వీలుగ రివర్స్ రొటేషన్ మోడ్ ను కలిగి ఉంటుంది. నాలుగేళ్ల వారంటీ ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ. 3,199గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..