EPFO: ఈ-పాస్‌బుక్ సర్వర్ డౌన్! మరీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా? ఇదిగో ఇలా..

|

Apr 28, 2023 | 3:20 PM

ఈ-పాస్ బుక్ ఆన్ లైన్ వెబ్ సైట్ పనిచేయపోవడం.. ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అధికమవడంతో ఈపీఎఫ్ఓ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతా వివరాలు తెలుసుకునేందుకు ఎస్ఎంఎస్ లేదా ఉమాంగ్ యాప్ లను వినియోగించవచ్చని ఈపీఎఫ్ఓ ప్రకటించింది.

EPFO: ఈ-పాస్‌బుక్ సర్వర్ డౌన్! మరీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా? ఇదిగో ఇలా..
Epf Passbook Balance
Follow us on

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖతాదారులు వారి ఖాతాలకు సంబంధించిన పాస్ బుక్స్ చూసుకోడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)కు సంబంధించిన వెబ్ సైట్ సక్రమంగా పనిచేయడం లేదు. ముఖ్యంగా పాస్ బుక్ పేజీ అస్సలు పనిచే యడం లేదు. ఖాతాదారులు తమ ఖాతాల్లోని బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు పాస్ బుక్ ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తుంటే వారికి ఈ-పాస్ బుక్ పేజీపై ‘404 ఎర్రర్’ అని వస్తోంది. కొత్త మందికి ‘నాట్ ఫౌండ్’ అని చూపిస్తోంది. మరికొందరికీ ‘ఆన్ దిస్ సర్వర్ ది రిక్వెస్టెడ్ యూఆర్ఎల్/మెంబర్ పాస్ బుక్/ లాగిన్ నాట్ ఫౌండ్’ అని చూపిస్తోంది. దీనివల్ల చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య దాదాపు రెండు వారాలుగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది వినియోగదారులు చెరబుతున్న దాని ప్రకారం ఈ-పాస్ బుక్ పేజీ 15 రోజులుగా పనిచేయడం లేదని తెలుస్తోంది. దీనిపై ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేస్తే  ‘ప్రియమైన సభ్యులారా, అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఈ విషయాన్ని సంబంధిత బృందం పరిశీలిస్తోంది. దయచేసి కొంత సమయం వేచి ఉండండి. ఈ విషయం త్వరలో పరిష్కరించబడుతుంది’ అని బదులిచ్చింది.

మరి ఇప్పుడు ఏం చేయాలి..

ఈ-పాస్ బుక్ ఆన్ లైన్ వెబ్ సైట్ పనిచేయపోవడం.. ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అధికమవడంతో ఈపీఎఫ్ఓ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతా వివరాలు తెలుసుకునేందుకు ఎస్ఎంఎస్ లేదా ఉమాంగ్ యాప్ లను వినియోగించవచ్చని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎస్ఎంఎస్ లేదా ఉమాంగ్ ల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం రండి..

ఉమాంగ్(UMANG) యాప్ ద్వారా ఇలా..

  • మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ ను డౌన్ లోన్ చేసి, రిజిస్టర్ అవ్వండి.
  • సెర్చ్ బార్‌లో ‘EPFO’ని ఎంటర్ చేసి, క్లిక్ చేయండి.
  • సేవల జాబితా నుండి ‘వ్యూ పాస్ బుక్’ను ఎంచుకోండి.
  • మీ పీఎఫ్ ఖాతాకు సంబంధించిన యూఏఎన్ నంబర్ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయండి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి.
  • మెంబర్ ఐడీని సెలక్ట్ చేసుకొని ఈ పాస్ బుక్ ని డైన్ లోడ్ చేసుకోండి.

ఎస్ఎంఎస్ ద్వారా..

  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899కి “EPFOHO UAN” అని మెసేజ్ పంపితే మీకు మళ్లీ మీ ఖాతా బ్యాలెన్స్ తో కూడిన వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి.
  • అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ను పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి