Health Care Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022(Budget 2022) ఫిబ్రవరి 1న ప్రకటించనున్నారు. దీంతో ప్రభుత్వంపై చాలా రంగాలు ఆశలు పెట్టుకున్నాయి. అదేవిధంగా, ఆరోగ్య సంరక్షణ రంగం కూడా బడ్జెట్ 2022పై భారీగా ఆశలు పెట్టుకుంది. ఆరోగ్య సంరక్షణ(Health Care Industry) వ్యయంలో 10 నుంచి 12 శాతం పెరుగుదలను ప్రభుత్వం ప్రకటింయచే అవకాశం ఉంది. హెల్త్‌కేర్ సెగ్మెంట్ దాని మొత్తం ప్యాకేజీలో రూ. 18,000 కోట్ల అధిక కేటాయింపులు ఉంచే ఛాన్స్ ఉంది. ఇందులో కొన్ని కీలక అంశాలను ఇప్పుడు చూద్దాం..
ఆరోగ్య సంరక్షణ వ్యయంలో 10-12 శాతం పెరుగుదలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
హెల్త్‌కేర్ సెగ్మెంట్ దాని మొత్తం ప్యాకేజీలో రూ. 18,000 కోట్ల అధిక కేటాయింపులను చూసే అవకాశం ఉంది.
2021 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో, రూ. 223,846 కోట్లు మొత్తం వ్యయంగా ప్రకటించారు.
టీకాల కోసం ఏర్పాటు చేసిన నిధిని ఈ బడ్జెట్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది.
వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం రూ. 50,000 కోట్లు కేటాయించింది.
దేశంలో ఆరోగ్య, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది.
పార్లమెంట్ బడ్జెట్ సెషన్ జనవరి 31, 2022న ప్రారంభం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2022న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2022ను సమర్పించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 8 వరకు కొనసాగుతాయి.
రాష్ట్రపతి ప్రసంగం తర్వాత జనవరి 31న ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సెషన్ మొదటి భాగం ఫిబ్రవరి 11న ముగుస్తుంది.
ఒక నెల రోజుల విరామం తర్వాత, సెషన్ రెండవ భాగం మార్చి 14 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 8న ముగుస్తుందని ప్రకటించారు.
విరామ సమయంలో పార్లమెంటరీ కమిటీలు తమ మంత్రిత్వ శాఖలకు చేసిన బడ్జెట్ కేటాయింపులను పరిశీలించేందుకు అనుమతిస్తాయి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు ప్రచారం జోరందుకుంది. ఫిబ్రవరి 10న సెషన్‌లోని మొదటి భాగంలో ఓటింగ్ జరగనుంది.
మార్చి 14న విరామం తర్వాత ఉభయ సభలు సమావేశమైనప్పుడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
మొత్తం ఐదు రాష్ట్రాలకు సంబంధించి మార్చి 10న కౌంటింగ్ జరగనుంది.
Also Read: Budget 2022: బడ్జెట్‌పై బ్యాంకింగ్ రంగం భారీ ఆశలు.. ఆ విషయంలో ప్రత్యేక మినహాయింపుల కోసం ఎదురుచూపులు!
Budget 2022: బడ్జెట్ 2022లో ఈ రంగాలపై స్పెషల్ ఫోకస్.. ఎందుకోసం అంటే..