AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. ఈ బెనిఫిట్స్ అన్నీ కట్..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాకిచ్చింది. జులై 1వ తేదీ నుంచి పలు ప్రయోజనాల్లో కొత విధింపునకు సిద్దమైంది. ఎయిర్ పోర్టు ఉచిత లాంజ్ బెనిఫిట్స్‌లో మార్పులు చేసింది. దేశీయ ఎయిర్‌పోర్టులో ఉచిత లాంజ్ సౌకర్యం కల్పించే అంశంలో ఈ మార్పలు చేసింది.

Credit Card: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. ఈ బెనిఫిట్స్ అన్నీ కట్..
Hdfc Bank
Venkatrao Lella
|

Updated on: Jun 04, 2026 | 6:17 PM

Share

తమ క్రెడిట్ కార్డు కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ షాకిచ్చింది. జులై 1వ తేదీ నుంచి కొత్త మార్పులను అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. పలు క్రెడిట్ కార్డులకు ప్రస్తుతం అందిస్తున్న బెనిఫిట్స్‌లో భారీగా కొత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌, క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లలో మార్పులకు శ్రీకారం చుట్టింది. రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డుకు సంబంధించి దేశీయ ఎయిర్‌పోర్టు లాంజ్ సౌకర్యం, రివార్డు పాయింట్లలో కొత విధించింది. అన్ని క్రెడిట్ కార్డులు ఇదే విధానాన్ని పాటిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా అదే బాటలో నడుస్తోంది.

కొత్త రూల్స్ ఏంటంటే..?

రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత విధించింది. దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో ఉచిత లాంజ్ సుదుపాయానికి ఆంక్షలు విధించింది. ఇక నుంచి కార్డు నుంచి నిర్ణీత మొత్తంలో ఖర్చు చేస్తేనే లాంజ్ సౌకర్యం కల్పిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నిర్దేశించిన పరిమితికి మంచి ఖర్చు చేస్తేనే.. తర్వాతి ఏడాదిలో ఉచిత లాంజ్ సదుపాయం కల్పిస్తారు. ప్రస్తుతం ఇస్తున్న వోచర్ ఆధారిత లాంజ్ యాక్సెస్ కూడా అందుబాటులో ఇక నుంచి ఉండదని హెచ్‌డీఎఫ్‌సీ స్పష్టం చేసింది. గడిచిన ఆర్ధిక సంవత్సరంలో రూ.60 వేలు ఖర్చు చేస్తే తర్వాతి ఏడాదిలో మూడు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందుతారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్ వద్ద కార్డును స్కైప్ చేసి ఉచిత సదుపాయం పొందవచ్చు. జులై-సెప్టెంబర్ 2026 త్రైమాసికంలో ఒకవేళ లాంజ్ సౌకర్యం పొందాలనుకుంటే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.60 వేలు క్రెడిట్ కార్డు నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మారిన రివార్డ్ పాయింట్ల విధానం

ఇక రివార్డ్ పాయింట్ల విధానంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. అర్హత కలిగిన ట్రన్సాక్షన్లకు గాను ప్రతీ రూ. 150 ఖర్చుకు 4 రివార్డ్ పాయింట్లు ఇస్తున్నారు. ఇక రూ.200 ఖర్చుకు గాను 5 పాయింట్లు ఇస్తున్నారు. ఇక ఇండియాలో ఉండి వేరే దేశంలో నమోదు చేసుకున్న వ్యాపారులతో రూపాయల్లో జరిపే లావాదేవీలకు డీసీసీ రుసుంను 1.75 శాతానికి మార్చారు. మే 15వ తేదీ నుంచి రివార్డు పాయింట్ల విధానం అమల్లోకి వచ్చింది.

Follow Us
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు