Unclaimed Fd’s: క్లెయిమ్ చేయని ఎఫ్‌డీ ఉందా? ఆర్‌బీఐ పోర్టల్ ద్వారా సింపుల్‌గా ట్రాకింగ్..
ఫిక్స్‌డ్ డిపాజిట్లు నిర్ణీత వ్యవధిలో విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవి సమయానికి విత్‌డ్రా చేసుకోకపోతే అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల కింద బ్యాంకులు వద్ద ఉండిపోతాయి. ఇలాంటి డిపాజిట్లను తిరిగి క్లెయిమ్ చేసుకోవాలంటే నిర్ణీత ప్రాసెస్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిపాజిట్ చేసిన వారు చనిపోయిన సమయంలో ఆ డిపాజిట్ల గురించి వారసులకు తెలియని సందర్భంలో మాత్రమే ఎక్కువ శాతం డిపాజిట్లు అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లగా ఉండిపోతాయి.

సంపాదించిన సొమ్ముకు నమ్మకమైన రాబడి కోసం చాలా మంది భారతీయులు ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే ఇలా చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు నిర్ణీత వ్యవధిలో విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవి సమయానికి విత్‌డ్రా చేసుకోకపోతే అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల కింద బ్యాంకులు వద్ద ఉండిపోతాయి. ఇలాంటి డిపాజిట్లను తిరిగి క్లెయిమ్ చేసుకోవాలంటే నిర్ణీత ప్రాసెస్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిపాజిట్ చేసిన వారు చనిపోయిన సమయంలో ఆ డిపాజిట్ల గురించి వారసులకు తెలియని సందర్భంలో మాత్రమే ఎక్కువ శాతం డిపాజిట్లు అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లగా ఉండిపోతాయి. వీటి గురించి వారసులు తెలుసుకోవాలంటే విస్తృతమైన బ్యాంకులు కారణంగా ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారో? తెలియదు. ఇలాంటి సమస్యను పరిష్కరించడంతో అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లను లబ్ధిదారులకు అందించేలా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. ఓ ప్రత్యేక పోర్టల్ ద్వారా అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల వివరాలను పౌరులకు తెలియజేయనుంది యూడీజీఏఎం పోర్టల్ ద్వారా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. కాబట్టి ఈ తాజా పోర్టల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గురువారం నుంచి కేంద్రీకృత వెబ్ పోర్టల్ యూడీజీఏఎం (క్లెయిమ్ చేయని డిపాజిట్లు సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి గేట్‌వే)ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌ని పబ్లిక్ ఉపయోగించుకోవడానికి, అనేక బ్యాంకుల్లో తమ అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను ఒకే చోట వెతకడం సులభతరం చేయడానికి ఆర్‌బీఐ ద్వారా అభివృద్ధి చేశారు. .ఏప్రిల్ 06, 2023 నాటి డెవలప్‌మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్‌మెంట్‌లో భాగంగా క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను శోధించడానికి కేంద్రీకృత వెబ్ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తంలో పెరుగుతున్న ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు ప్రజా చైతన్య ప్రచారాలను చేపడుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్లను క్లెయిమ్ చేయడానికి వారి సంబంధిత బ్యాంకులను గుర్తించి సంప్రదించమని ఆర్‌బిఐ ప్రజల సభ్యులను ప్రోత్సహిస్తోంది
అయితే తాజా పోర్టల్ ద్వారా డిపాజిట్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి లేదా వారి డిపాజిట్ ఖాతాలను వారి సంబంధిత బ్యాంకుల్లో ఆపరేటివ్‌గా చేయడానికి వీలు కల్పిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్, భాగస్వామ్య బ్యాంకులు పోర్టల్‌ను అభివృద్ధి చేయడంలో సహకరించాయి. వినియోగదారులు పోర్టల్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏడు బ్యాంకులకు సంబంధించి వారి అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను యాక్సెస్ చేయగలరు. పోర్టల్‌లో మిగిలిన బ్యాంకుల కోసం శోధన సౌకర్యం అక్టోబర్ 15, 2023 నాటికి దశలవారీగా అందుబాటులోకి వస్తుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాంకులు ఇవే
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్.
- సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్.
- డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్.
- సిటీ బ్యాంక్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







