GST Council: ధరలపై GST పెంపు విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను కౌన్సిల్‌ కోరలేదు: నివేదిక

GST Council: మరోసారి ప్రజలపై ధరల పెంపు భారం పడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వస్తు సేవల పన్ను (GST) రేట్ల హేతుబద్దీకరణ ప్రతిపాదనలతో పాటు జీఎస్టీ కౌన్సిల్‌ తాజాగా..

GST Council: ధరలపై GST పెంపు విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను కౌన్సిల్‌ కోరలేదు: నివేదిక
Follow us
Subhash Goud

|

Updated on: Apr 24, 2022 | 9:56 PM

GST Council: మరోసారి ప్రజలపై ధరల పెంపు భారం పడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వస్తు సేవల పన్ను (GST) రేట్ల హేతుబద్దీకరణ ప్రతిపాదనలతో పాటు జీఎస్టీ కౌన్సిల్‌ తాజాగా 143 వస్తువులకు సంబంధించిన జీఎస్టీ రేట్ల పెంపు విషయంలో రాష్ట్రాల (States) అభిప్రాయం కోరినట్లు వస్తున్న వార్తలపై సంబంధిత వర్గాలు స్పందించాయి. వస్తువులపై రేట్లు పెంపు అంశానికి సంబంధించి రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరలేదని నివేదికలు వెలువడ్డాయి. సగానికి పైగా వస్తువులను అత్యధిక పన్ను GST 28 శాతానికి మార్చే ప్రతిపాదన కూడా లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. జీఎస్టీ కౌన్సిల్ గతేడాది కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో రాష్ట్ర మంత్రులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

జీఎస్‌టీ రేటు హేతుబద్ధీకరణను పరిశీలిస్తున్న మంత్రుల బృందం ఇంకా తన నివేదికను జీఎస్‌టీ కౌన్సిల్‌కు సమర్పించాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తం 143 వస్తువులపై రేట్ల పెంపుపై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను కౌన్సిల్ కోరినట్లుగా వార్తలు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కౌన్సిల్‌ రాష్ట్రాల అభిప్రాయాలను కోరలేదని వెల్లడించింది. పన్ను రేట్లను హేతుబద్దీకరించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చనే మార్గాలను సూచించడానికి కౌన్సిల్‌ గత ఏడాది కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.

అయితే పశ్చిమబెంగాల్‌, కేరళ, గోవా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ఆర్థిక మంత్రులను సభ్యులుగా చేర్చి కర్ణాటక సీఎం నేతృత్వంలో ఏడుగురు సభ్యులు పన్నును హేతుబద్దీకరించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను సూచిస్తుంది. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి తేదీలు ఇప్పటి వరకు ప్రకటించలేదని, మే ద్వితీయార్థంలో సమావేశం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జీఎస్టీలో నాలుగు రేట్లు ఉంటాయి. ఇందులో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం రేట్లు ఉంటాయి. అదనంగా విలువైన లోహాలు వంటి కొన్ని వస్తువులకు ప్రత్యేక రేట్లు ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

EPFO: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న డబ్బును మరొకదానికి బదిలీ చేయాలనుకుంటున్నారా..? సింపుల్‌ ఇలా చేయండి..!

PAN Card Uses: పాన్‌ కార్డు ఉపయోగం ఏమిటి..? ఏయే వాటికి అవసరం.. పూర్తి వివరాలు

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?