GST Collection: భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

|

Dec 02, 2022 | 9:51 PM

ప్రతి నెల జీఎస్టీ ఎంత వసూళ్లు అయ్యాయనే విషయం కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తుంటుంది. ఇక నవంబర్‌ నెలలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. అంతకు ముందు నెలలో కూడా పెంపు కనిపించింది..

GST Collection: భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
Gst
Follow us on

ప్రతి నెల జీఎస్టీ ఎంత వసూళ్లు అయ్యాయనే విషయం కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తుంటుంది. ఇక నవంబర్‌ నెలలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. అంతకు ముందు నెలలో కూడా పెంపు కనిపించింది. నవంబర్‌ నెలలోరూ.1.46 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు అయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,31,526 కోట్లతో పోలిస్తే 11 శాతం ఎక్కువే. అయితే రూ.1.4 లక్షల కోట్ల కంటే అధికంగా జీఎస్టీ వసూలు కావడం ఇది వరుసగా తొమ్మిదో నెల అని కేంద్రం వెల్లడించింది.

గత నెల రూ.1,45,867 కోట్ల జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్‌ జీఎస్టీ కింద రూ.25,681 కోట్లు, స్టేట్‌ జీఎస్టీ కింద రూ.32,651 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ కింద రూ.77,102 కోట్లు, సెస్‌ రూపంలో రూ.10,433 కోట్లు వసూలు అయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

తెలంగాణలో జీఎస్టీ 4,228 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ళు కూడా పెరిగిపోతున్నాయి. గత నెలకుగాను రూ.4,228 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో రూ.3,931 కోట్లతో పోలిస్తే ఇప్పుడు 8 శాతం అధికంగానే ఉన్నట్లు తెలిపింది. ఇక ఏపీలో కూడా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 14 శాతం అధికంతో రూ.3,134 కోట్లుగా వసూలు అయినట్లు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..