Railway Passengers: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! ఇప్పుడు ATVM స్మార్ట్ కార్డ్ చెల్లుతున్నాయ్..

|

Nov 02, 2021 | 9:55 PM

Railway Passengers: దేశంలో అతి పెద్ద రవాణా సంస్థ ఇండియన్‌ రైల్వే. ప్రయాణీకుల సౌకర్యార్థం ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే నార్త్ వెస్ట్రన్ రైల్వే ప్రయాణీకుల

Railway Passengers: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! ఇప్పుడు ATVM స్మార్ట్ కార్డ్ చెల్లుతున్నాయ్..
Atvm
Follow us on

Railway Passengers: దేశంలో అతి పెద్ద రవాణా సంస్థ ఇండియన్‌ రైల్వే. ప్రయాణీకుల సౌకర్యార్థం ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే నార్త్ వెస్ట్రన్ రైల్వే ప్రయాణీకుల కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ATVM (Automatic Ticket Vending Machine) స్మార్ట్ కార్డ్‌ల చెల్లుబాటు నవంబర్ 1, 2021 నుంచి మిగిలిన రోజులకు పొడిగించింది. లాక్‌డౌన్ తర్వాత మళ్లీ అమలులోకి వస్తుంది. ATVM స్మార్ట్ కార్డ్ హోల్డర్ల చెల్లుబాటు మార్చి 22, 2020 తర్వాత ముగుస్తుంది.

లాక్‌డౌన్ కారణంగా ఉపయోగించలేని కార్డ్‌లు ఉపయోగించేలా అవకాశం కల్పించింది. నవంబర్ 1, 2021 నుంచి మిగిలిన రోజులకు పొడిగించింది. ప్రయాణీకుల ప్రయోజనాల దృష్ట్యా నార్త్ వెస్ట్రన్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం చాలా అద్భుతమైనది. తద్వారా ATVM స్మార్ట్ కార్డ్ హోల్డర్లు తమ కార్డులోని మిగిలిన మొత్తాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి ATVM కార్డ్ సౌకర్యాన్ని ప్రారంభించింది.

ఈ కార్డు సహాయంతో ఏ ప్రయాణీకులైనా సరే లైన్‌లో నిలబడకుండా అన్‌రిజర్వ్‌డ్ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. తద్వారా రైలులో ప్రయాణించవచ్చు. ఈ కార్డ్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని రీఛార్జ్ చేయడానికి లైన్‌లో ఉండవలసిన అవసరం లేదు. ATVM కార్డ్‌ని కూడా రైల్వే ఆన్‌లైన్ సేవల ద్వారా సులభంగా రీఛార్జ్ చేయవచ్చు. సరళమైన భాషలో చెప్పాలంటే ఈ రైల్వే కార్డ్ ఢిల్లీ మెట్రో స్మార్ట్ కార్డ్‌ను పోలి ఉంటుంది. ఈ కార్డు ప్రయాణీకుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా టిక్కెట్ కౌంటర్ వద్ద పొడవైన లైన్ల నుంచి వారిని కాపాడుతుంది. ఇది మాత్రమే కాదు కార్డుతో కొనుగోలు చేసిన టిక్కెట్‌ఛార్జీపై తగ్గింపు కూడా ఉంటుంది.

Health News: ఈ ఫుడ్ తింటున్నారా జాగ్రత్త..! పెద్దపేగు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం..

Zodiac Signs: ఈ 3 రాశులవారికి అసూయ ఉండదు..! ఇతరుల విజయాన్ని ఆనందిస్తారు..

Indian Railway: ట్రైన్‌ డ్రైవర్‌ జీతం ఇంజనీర్‌ కంటే ఎక్కువ..! ఎందుకో తెలుసా..?