FASTag: ఫాస్టాగ్‌కు ఇక బైబై.. టోల్ వసూలుకు జీపీఎస్ ఆధారిత కొత్త విధానం..
దేశంలో టోల్ వసూలుకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. దాని ప్రకారం అన్ని టోల్ ప్లాజాలు, టోల్ కలెక్షన్ బూత్ లను తొలగిస్తారు. జీపీఎస్ ఆధారిత వ్యవస్థను అమలు చేస్తారు. దీంతో కొత్త విధానంపై దేశమంతటా చర్చ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా మనం జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తున్నప్పుడు టోల్ ప్లాజాలు కనిపిస్తాయి. మనం నాలుగు చక్రాల వాహనాల్లో వెళితే ఇక్కడ డబ్బులు చెల్లించాలి. టూ వీలర్, త్రీ వీలర్స్ కు మినహాయింపు ఉంటుంది. టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లించడానికి వాహనాలు బారులు తీరి ఉంటాయి. అందరూ డబ్బులు కట్టి ముందుకు వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. అందుకు ప్రభుత్వం ఫాస్టాగ్ విధానం ప్రవేశపెట్టింది. దీని ద్వారా చాాలా సులభంగా టోల్ చెల్లించి, ముందుకు వెళ్లిపోవచ్చు. అయితే ఫాస్టాగ్ టెక్నాలజీకి కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఫాస్టాగ్ స్థానంలో నూతనంగా జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను తీసుకు రాబోతోంది.
జీపీఎస్ విధానం అమలుకు ప్రణాళిక..
దేశంలో టోల్ వసూలుకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. దాని ప్రకారం అన్ని టోల్ ప్లాజాలు, టోల్ కలెక్షన్ బూత్ లను తొలగిస్తారు. జీపీఎస్ ఆధారిత వ్యవస్థను అమలు చేస్తారు. దీంతో కొత్త విధానంపై దేశమంతటా చర్చ కొనసాగుతోంది. నాలుగు చక్రాలు, ఆపై పెద్ద వాహనాల నుంచి టోల్ వసూలు చేసేందుకు కొన్నేళ్ల క్రితం ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీతో పనిచేసే ఈ విధానం ద్వారా టోల్ ఛార్జీలను ఆటోమేటిక్‌గా వసూలు చేస్తున్నారు.
ఆటోమేటిక్ గా చార్జీల వసూలు..
ఫాస్టేజ్ విధానంలో వాహనం విండ్‌షీల్డ్‌పై ఫాస్టేజ్ చిప్ ఆధారిత స్టిక్కర్ ఉంటుంది. వాహనం టోల్ గేట్ మీదుగా వెళ్లినప్పుడు స్కానర్ ఆ ఫాస్టేజ్ స్టిక్కర్‌ను స్కాన్ చేస్తుంది. నిర్థిష్ట మొత్తాన్ని కారు యజమాని ఖాతా నుంచి మినహాయించబడుతుంది. గతంలో టోల్ గేట్ వద్ద కారును ఆపి, నగదు లేదా కార్డు ద్వారా టోల్ చార్జీలు చెల్లించేవారు. దానికి చాలా సమయం పట్టేది. టోల్ ప్లాజాల వద్ద కార్లు, ఇతర వాహనాలు బారులు తీరేవి. ఫాస్టాగ్ విధానంతో ఆ ఇబ్బందులు తప్పాయి. వాహన దారులకు ప్రయాణం సమయం తగ్గింది. ఇప్పుడు ఈ ఫాస్టాగ్ స్థానంలో కొత్త సాంకేతికత వ్యవస్థను తీసుకురావాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో జీపీఎస్ విధానానికి రూపకల్పన చేస్తుంది.
కొత్త విధానం..
కేంద్రం కొత్తగా తీసుకు రానున్న జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిలో అన్ని వాహనాలకు జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలి. త్రీజీ, జీపీఎస్ కనెక్టివిటీతో మైక్రో కంట్రోలర్ ద్వారా ఈ సాంకేతికతను అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కారులోని జీపీఎస్ పరికరం ద్వారా వాహనాల మార్గాన్ని ఎన్ హెచ్ఏఐ లేదా రెగ్యులేటరీ ఏజెన్సీ పరిశీలిస్తుంది. ఏ వాహనాలు టోల్ రోడ్లు మీదుగా వెళుతున్నాయి. ఎన్ని టోల్ గేట్ల మీదుగా ప్రయాణం సాగిస్తున్నాయో గుర్తిస్తాయి. దాని ఆధారంగా వాహన యజమాని నుంచి ఫీజు వసూలు చేస్తారు.
నిరంతరం పర్యవేక్షణ..
ఫాస్టాగ్ విధానంలో వాహనం టోల్ ప్లాజా మీదుగా వెళ్లినప్పుడు ఆటోమేటిక్‌గా టోల్ ఛార్జీలను వసూలు చేస్తుంది. జీపీఎస్ విధానం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది ప్రయాణంలో వాహనాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. వాహనాల కదలికపై అప్రమత్తంగా ఉంటుంది. జీపీఎస్ విధానంలో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




