Railways News: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కి పెను ఊరట లభించనుంది. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌లో జరిగే టికెట్ బుకింగ్స్ ద్వారా లభించే కన్వేయన్స్ ఫీజులో సగం(50శాతం) తమకు చెల్లించాలని రైల్వే శాఖ ఆదేశించడం తెలిసిందే. ఇప్పటివరకూ టికెట్ ఛార్జీ మొత్తం రైల్వే శాఖకు బదిలీ అవుతుండగా, టికెట్ బుకింగ్‌కు వసూలుచేసే కన్వేయన్స్ ఫీజు మొత్తాన్ని ఐఆర్‌సీటీసీ తీసుకుంటోంది. తాజా ఆదేశాలతో నవంబరు 1 నుంచి కన్వేయన్స్ ఫీజులో 50 శాతం రైల్వే శాఖకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఐఆర్‌సీటీ ఆదాయానికి భారీగా గండి కొట్టే అవకాశం నెలకొంది. దీంతో ఐఆర్‌సీటీసీ షేర్ విలువ భారీగా పడిపోయింది. అక్టోబర్ 29న ఒక్క రోజే షేర్ విలువ 20 శాతం మేర నష్టపోయింది. ఐఆర్‌సీటీసీలో పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ తగ్గించుకున్నాయి.
అయితే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించుకున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(DIPAM) సెక్రటరీ తుహిన్ కంటా పాండే సీఎన్‌బీసీ -టీవీ18కి తెలిపారు. కరోనా పాండమిక్ ముందు వరకు కన్వేయన్స్ ఫీజుతో వచ్చే ఆదాయాన్ని ఐఆర్‌సీటీసీ.. రైల్వే శాఖతో షేర్ చేసుకునేదని ఓ సీనియర్ రైల్వే శాఖ అధికారి తెలిపారు. అయితే పాండమిక్ కారణంగా 100 శాతం కన్వేయన్స్ ఫీజును ఐఆర్‌సీటీసీకి చెందేలా ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Ministry of Railways has decided to withdraw the decision on IRCTC convenience fee pic.twitter.com/HXIRLxXTlL
— Secretary, DIPAM (@SecyDIPAM) October 29, 2021
కన్వేయన్స్ ఫీజులో తమకు 50 శాతం చెల్లించాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ ఒకట్రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఈ ప్రకటన వెలువడితే ఐఆర్‌సీటీసీ షేర్ విలువ మళ్లీ పెరిగే అవకాశముందని స్టాక్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 12 గం.లకు ఐఆర్‌సీటీసీ షేర్ విలువ 6.20శాతం నష్టంతో రూ.856.85 వద్ద ట్రేడింగ్ అవుతోంది.
Also Read..
NGT: తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై ఎన్జీటీ స్టే..
Gold Demand: తగ్గేదే లే.. భారత్‌లో పసిడికి తగ్గని డిమాండ్.. 139 టన్నుల బంగారం విక్రయాలు