Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: వచ్చే బడ్జెట్‌లో వారికి తీపి కబురు రానుందా..? కేంద్రం ప్లాన్‌ ఏంటి?

వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి బడ్జెట్‌కు ముందు దేశంలోని ప్రజలు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నప్పటికీ, ఈ బడ్జెట్‌తో సామాన్యులకు గొప్ప ఉపశమనం లభిస్తుందని అంచనాలు ఉన్నాయి.  నిజానికి ఇప్పుడు బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం..

Budget 2024: వచ్చే బడ్జెట్‌లో వారికి తీపి కబురు రానుందా..? కేంద్రం ప్లాన్‌ ఏంటి?
Budget 2024
Follow us
Subhash Goud

|

Updated on: Jun 20, 2024 | 3:35 PM

వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి బడ్జెట్‌కు ముందు దేశంలోని ప్రజలు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నప్పటికీ, ఈ బడ్జెట్‌తో సామాన్యులకు గొప్ప ఉపశమనం లభిస్తుందని అంచనాలు ఉన్నాయి.  నిజానికి ఇప్పుడు బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఆదాయపు పన్ను మినహాయింపుకు సంబంధించిన ఎంపికలను ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిశీలిస్తోంది. మధ్యతరగతి ప్రజలే దేశాభివృద్ధికి చోదకమని, వారి సంక్షేమం, సౌకర్యమే మా ప్రాధాన్యత అని ప్రధాని మోదీ ఇటీవల ప్రసంగించారు.

బడ్జెట్‌కు ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం

అటువంటి పరిస్థితిలో ఈ బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం నుండి ఆదాయపు పన్ను మినహాయింపును ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం.. ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో మార్పులు చేయవచ్చు. ఏటా రూ.15 నుంచి 17 లక్షల ఆదాయం ఉన్న వారి ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కొత్త పన్ను విధానంలోకి మరింత మందిని తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Broadband Plans: మీకు ఇంటర్నెట్‌ కావాలా? దిమ్మదిరిగే మూడు చవకైన బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్స్‌!

గత హయాంలో మోడీ ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రారంభించగా, కొత్త పన్ను విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త పన్ను విధానంలో సంవత్సరానికి రూ. 15 నుండి 17 లక్షల వరకు సంపాదిస్తున్న వారికి తక్కువ పన్ను నిబంధనను ఏర్పాటు చేస్తే, అది పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది.

కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం గమనార్హం. పాత పన్ను విధానం ప్రకారం, రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీని తర్వాత రెండింటిపై రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. అంటే కొత్త పన్ను విధానంలో రూ.7.50 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి: School Holidays: సంచలన నిర్ణయం.. జూలై 1 వరకు పాఠశాలలు బంద్‌.. కారణం ఏంటంటే..

కొత్త పన్ను విధానం ఆదాయపు పన్ను స్లాబ్‌లు:

కొత్త పన్ను విధానంలో రూ. 0-3 లక్షల వార్షిక జీతంపై పన్ను లేదు. దీని తర్వాత రూ.3 నుంచి 6 లక్షల ఆదాయంపై 5%, రూ.6 నుంచి 9 లక్షల ఆదాయంపై 10%, రూ.9 నుంచి 12 లక్షల ఆదాయంపై 15%, రూ.12 నుంచి 15 లక్షల ఆదాయంపై 20% పన్ను విధించబడుతుంది. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30%. ఇది కాకుండా, ఆరోగ్యం, విద్య సెస్‌గా 4% వసూలు చేస్తారు.

ఇది కూడా చదవండి: AC Side Effects: గంటల తరబడి ఏసీలో కూర్చొని నేరుగా బయటకు వెళ్తున్నారా? డేంజరే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి