AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sundar Pichai: సుందర్‌ పిచాయ్‌ కీలక వ్యాఖ్యలు.. 25శాతం కోడింగ్‌ ఏఐతోనే అంటూ..

ప్రస్తుతం కృత్రిమ మేధ వినియోగం పెరుగుతోంది. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోంది. గూగుల్ ఇందులో మరింత వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్ కొత్త కోడింగ్ లో 25 శాతం ఏఐతోనే చేస్తున్నట్లు ఆయన తన బ్లాగ్ లో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏఐ వినియోగాన్ని మరింత పెంచనున్నట్లు చెబుతున్నారు..

Sundar Pichai: సుందర్‌ పిచాయ్‌ కీలక వ్యాఖ్యలు.. 25శాతం కోడింగ్‌ ఏఐతోనే అంటూ..
Google Ceo
Narender Vaitla
|

Updated on: Oct 30, 2024 | 7:07 PM

Share

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం భారీగా పెరుగుతోంది. తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ను రూపొందించడానికి కృత్రిమ మేధపై ఎక్కువగా ఆధారపడుతోందని సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. గూగుల్‌ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా సుందర్‌ పిచాయ్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పంచుకున్నారు. జనరేట్ చేసిన కోడ్‌ను ఇంజనీర్లు రివ్యూ చేస్తున్నప్పటికీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెరిగిందని తెలిపారు. గుగూల్‌ అభివృద్ధిలో కృత్రిమ మేధది కీలక పాత్ర అని సుందర్‌ పిచయ్‌ చెప్పుకొచ్చారు.

గూగుల్‌లో కొత్త కోడింగ్‌లో 25 శాతానికిపైగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమయాన్ని తగ్గించి, ఆవిష్కరణల విషయంలో వేగం పెంచడమే తమ లక్ష్యమని సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ఏఐ సాయంతో కోడింగ్ ప్రక్రియ వేగవంతమవుతుందని ఆయన అన్నారు. జెమినీ వంటి కొత్త మోడళ్లను మరింత వేగంగా తీసుకొచ్చేలా.. పరిశోధన, మెషిన్‌ లెర్నింగ్, సెక్యూరిటీ విభాగాలతో పాటు ఆయా ప్లాట్‌ఫామ్‌, డివైజ్‌లకు చెందిన సిబ్బందిని ఏకీకృతం చేసిందని పిచాయ్ తెలిపారు.

రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తరించనుందని, GitHub కోపైలట్‌ ద్వారా జెమినీని అందుబాటులో తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లకు ఏఐ టూల్స్‌ అందుబాటులోకి తేవడమే దీని అసలు ఉద్దేశమని తెలిపారు. ‘వీడియో ఏఐ’పైనా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపిన ఆయన.. యూట్యూబ్‌లో వీడియోల జనరేట్‌ కోసం త్వరలోనే ‘వియో’ను తీసుకురానున్నట్లు చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..