ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఖర్చులు అవసరాల నేపథ్యంలో రుణం తీసుకోవడం అనేది తప్పనిసరిగా మారింది. అయితే హోమ్ లోన్, కార్ లోన్ లేదా మరేదైనా లోన్ తీసుకోవాలని ప్లాన్ చేసే వారికి మంచి సిబిల్ స్కోర్ కలిగి ఉండటం చాలా అవసరం. అయితే చాలా మంది వ్యక్తులు తమ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోవాలో? తెలియడం లేదు. అయితే ఇలాంటి వారికి సాయం చేసేలా గూగుల్ పే యాప్ ఎటువంటి ఛార్జీలు లేకుండా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసే అవకాశం ఇస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీ సిబిల్ స్కోర్ తెలుసుకోవడమే కాక నిర్దిష్ట నెల, సంవత్సరంతో సహా ఏవైనా ఆలస్యమైన చెల్లింపుల వివరాలను కూడా అందిస్తుంది. కొన్ని సెకన్లలోనే మన లోన్ హిస్టరీకు సంబంధించిన సెకన్లలో సమగ్ర నివేదిక రూపొందిస్తారు. గూగుల్ ప్రకారం ఈ ఫీచర్‌ను ప్రారంభించినప్పటి నుండి 5 కోట్ల మంది భారతీయులు ఉపయోగించారు. ఇది ఆర్థిక నిర్వహణ కోసం ఒక ప్రసిద్ధ సాధనంగా మారింది. ఈ నేపథ్యంలో గూగుల్ పేలో సిబిల్ స్కోర్‌ను ఎలా తనిఖీ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.
మీ సిబిల్ స్కోర్ అనేది 3 అంకెల సంఖ్య. ఇది మీ క్రెడిట్ యోగ్యతను ప్రతిబింబిస్తుంది. రుణదాతలు మీ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్‌లను ఆమోదించాలో? లేదో? అంచనా వేయడానికి సహాయపడుతుంది. 750 కంటే ఎక్కువ స్కోరు మంచిగా పరిగణిస్తారు. అయితే 850 కంటే ఎక్కువ స్కోరు అద్భుతంగా పరిగణిస్తారు. మీ క్రెడిట్ హెల్త్‌ను ట్రాక్ చేయడానికి మీ సిబిల్ స్కోర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఈ సదుపాయాన్ని గూగుల్ పే అదనపు ఖర్చు లేకుండా అందిస్తుంది. గూగుల్ పేలో మీ సిబిల్ స్కోర్‌ని ట్రాన్స్ యూనియన్ సిబిల్ ద్వారా అందిస్తారు. సిబిల్ స్కోర్ అనేది మీరు లోన్‌లు లేదా క్రెడిట్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసినప్పుడు మీ క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడానికి రుణదాతలు ఉపయోగిస్తారు. కాబట్టి గూగుల్ పే సిబిల్ స్కోర్‌ను ఎలా మెరుగుపరచాలనే దానిపై సిఫార్సులను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..