FD Rates Hike: మూడేళ్ల ఎఫ్‌డీలపై ముచ్చటైన వార్త.. పోస్టాఫీస్‌ బాటలోనే ఎస్‌బీఐ

| Edited By: Janardhan Veluru

Jan 05, 2024 | 4:09 PM

ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచాయి. డిసెంబర్ 29న మోడీ ప్రభుత్వం జనవరి-మార్చి త్రైమాసికానికి మూడేళ్ల పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ (పీఓటీడీ) పథకంపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది.ఇప్పుడు మూడు సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ఎస్‌బీఐకు సంబంధించిన మూడు సంవత్సరాల ఎఫ్‌డీ రేట్లతో ఓ సారి తెలుసుకుందాం.

FD Rates Hike: మూడేళ్ల ఎఫ్‌డీలపై ముచ్చటైన వార్త.. పోస్టాఫీస్‌ బాటలోనే ఎస్‌బీఐ
Business Idea
Follow us on

ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా పరిగణిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పలు బ్యాంకులు ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచాయి. డిసెంబర్ 29న మోడీ ప్రభుత్వం జనవరి-మార్చి త్రైమాసికానికి మూడేళ్ల పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ (పీఓటీడీ) పథకంపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది.ఇప్పుడు మూడు సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ఎస్‌బీఐకు సంబంధించిన మూడు సంవత్సరాల ఎఫ్‌డీ రేట్లతో ఓ సారి తెలుసుకుందాం.

మూడు సంవత్సరాల ఎస్‌బీఐ ఎఫ్‌డీ రేట్లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు అన్ని టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ వడ్డీ రేటు రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై వర్తిస్తుంది . 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై బ్యాంక్ 25 బీపీఎస్‌ రేట్లు పెంచింది. ఈ డిపాజిట్లు ఇప్పుడు 6.75 శాతాన్ని పొందుతున్నాయి. కొత్త రేటు 27 డిసెంబర్ 2023 నుండి అమలులోకి వచ్చింది. ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువకు 6.75 శాతంగా ఉంది. 

మూడేళ్ల పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్లు

ప్రభుత్వం 3 సంవత్సరాల కాల డిపాజిట్ల వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) 7 శాతం నుంచి 7.10 శాతానికి పెంచింది. ఈ రేట్లు 1 జనవరి 2024 నుండి అమలులోకి వస్తాయి.ఈ మూడు సంవత్సరాల డిపాజిట్  7.1 శాతం ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ తాజా వడ్డీ రేట్లు 

ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య ఎస్‌బీఐ ఎఫ్‌డీలు సాధారణ కస్టమర్లకు 3.5 శాతం నుంచి 7 శాతం వరకు ఇస్తాయి. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) అదనంగా పొందుతారు.

పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ల తాజా రేట్లు

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకాలు బ్యాంక్ ఎఫ్‌డీల మాదిరిగానే ఉంటాయి. పోస్ట్ ఆఫీసులు ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు టర్మ్ డిపాజిట్లను అందిస్తాయి. రివిజన్‌తో పోస్టాఫీసులలో ఒక సంవత్సరం కాల వ్యవధి డిపాజిట్ ఇప్పుడు 6.9 శాతం, రెండు సంవత్సరాల కాలవ్యవధికిఘేడు శాతం వస్తుంది. మూడేళ్లు-ఐదేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేట్లు వరుసగా 7.1 శాతం, 7.5 శాతంగా ఉంది. ఈ రేట్లు 1 జనవరి 2024 నుండి అమలులోకి వచ్చింది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..